కరోనా భయంతో 14 లక్షల రూపాయలు వాషింగ్ మెషిన్ లో వేసాడు…చివరికి ఏమైందంటే?

కరోనా భయంతో 14 లక్షల రూపాయలు వాషింగ్ మెషిన్ లో వేసాడు…చివరికి ఏమైందంటే?

by Mohana Priya

Ads

ఏదైనా అతిగా చేస్తే కచ్చితంగా అది ప్రమాదకరమే. కరోనా వైరస్ కారణంగా జనాలు దేని ముట్టుకోవాలి అన్నా కూడా భయపడుతున్నారు. దాంతో తీసుకునే జాగ్రత్తలు అన్ని కరెక్ట్ గానే తీసుకుంటున్నారు. అవేంటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మాత్రం అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానివల్ల కరోనా వైరస్ ఏమోగానీ లేని పోని సమస్యలు వస్తున్నాయి.

Video Advertisement

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌‌కు దగ్గరలో ఉన్న అన్సాన్ నగరానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల మరణించారు. దాంతో అతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా బంధుమిత్రులు అందరూ కలిసి 42 డాలర్ల సహాయం చేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం 50000 రూపాయలు అన్నమాట. ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా కాలం కావడంతో నోట్ల మీద ఏమైనా వైరస్ ఉంటుందేమో అనే అనుమానం వచ్చింది.

నోట్లని శానిటైజర్ తో శుభ్రం చేసి ఉంటాడేమో అని అనుకుంటాం. కచ్చితంగా ఇది అతి జాగ్రత్త అనిపిస్తుంది. కానీ అతను ఒక అడుగు ముందుకేసి నోట్లని వాషింగ్ మిషిన్ లో వేశాడు. ఇంక చెప్పేదేముంది? నోట్లన్నీ నానిపోయాయి. అంతటితో ఆగకుండా ఆ తడిసిన నోట్లని ఆరబెట్టడానికి వాటిని మైక్రోవేవ్ లో పెట్టాడు. నోట్ల కి చిల్లులు పడి పాడైపోయాయి.

అతనికి ఏం చేయాలో తెలీక నోట్ల ని తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చాడు. “అలాంటి నోట్లని బ్యాంకు వాళ్లు ఎందుకు తీసుకుంటారు కచ్చితంగా తీసుకోరు” అని అంటారా? అవును. మీరు అన్నట్టే జరిగింది. ఆ బ్యాంకు వాళ్లు ఆ నోట్లను తీసుకోలేదు. దాంతో ఈ వ్యక్తి చాలా సేపు వాళ్ళని బతిమిలాడితే చివరికి నోట్లపై నంబర్లు ఉన్న వాటిని తీసుకొని 1500 రూ ఇచ్చారు.

దేని గురించి అయినా అతిగా భయపడినప్పుడు మన మెదడు పనిచేయడం ఆగిపోతుంది. అతను కూడా తర్వాత ఆలోచించి ఉండొచ్చు ” అరె! అవి పేపర్లు కదా. నీళ్ళలో వేస్తే పాడైపోతాయి కదా. ఇంత చిన్న విషయాన్ని నేను ఎందుకు ఆలోచించలేకపోయాను? అని.

అతనే కాదు మనలో చాలామంది ఆలోచించకుండా చిన్న వాటిని కూడా అతిగా శుభ్రం చేస్తున్నారు. అతి జాగ్రత్త అంటే నోట్లని వాషింగ్ మిషన్ లో వేయడం ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఒకసారి శుభ్రం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆ వస్తువు లేదా పదార్థం పాడవకుండా శుభ్రం చేయండి. ఆరోగ్యంతో పాటు ఆలోచన కూడా చాలా ముఖ్యం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.


End of Article

You may also like