రూ.270తో లాటరీ టికెట్ కొన్నాడు..! తర్వాత ఏమైందంటే..? అమ్మిన వ్యక్తికే షాక్…!!

రూ.270తో లాటరీ టికెట్ కొన్నాడు..! తర్వాత ఏమైందంటే..? అమ్మిన వ్యక్తికే షాక్…!!

by Megha Varna

Ads

కాలం ఏ క్షణాన్న ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేము. ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగ కాలం మారిపోతూ ఉంటుంది. అయితే రాత్రికి రాత్రి ధనవంతులు అవ్వాలని ఎవరికి ఉండదు..? ఎంత డబ్బు ఉన్నా సరే ఎవరికైనా ఆశ ఉంటుంది. అయితే అందరికీ అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని చెప్పలేము.

Video Advertisement

కానీ ఒక అంబులెన్స్ డ్రైవర్ కి మాత్రం అదృష్టం దానంతట అదే వెతుక్కుంటూ వచ్చింది. లాటరీ టికెట్ కొన్న కొద్ది గంటలకే కోటి రూపాయలు అతను గెలుచుకున్నాడు. బెంగాల్ లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా ఆంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 270 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు.

ఇంకేముంది హఠాత్తుగా మధ్యాహ్నానికి కోటి రూపాయలు జాక్ పాట్ తగిలింది. అతనికి ఏం చేయాలో తోచక పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లారు. తనకి చాలా డబ్బులు కావాలని తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉందని.. చికిత్స చేయించాలని అనుకున్నాడు.

అలాగే ఒక ఇల్లు కూడా కొనుక్కోవాలని వుంది. ఈ లాటరీ అమ్మిన వ్యక్తి లాటరీ లో కోటి రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాను కానీ కోటి రూపాయలు జాక్ పాట్ రావడం ఇదే మొదటిసారి అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచాడు.


End of Article

You may also like