Ads
మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రేక్షకులకి ఉన్న అభిమానం, క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల పాత్రలు పోషించగల నటుల్లో ఒకరు చిరంజీవి. ఎలాంటి పాత్ర అయినా సరే చిరంజీవి చాలా సులభంగా చేస్తారు. చిరంజీవిని కొత్త పాత్రల్లో చూడాలి అని జనం ఎప్పుడూ ఆరాటపడుతుంటారు. కొత్త కొత్త కథలని చిరంజీవి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలి అని అనుకుంటారు.
Video Advertisement
చిరంజీవి గారు మళ్లీ హీరోగా వరస సినిమాల్లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కానీ ఎక్కువగా రీమేక్ లే చేస్తున్నారు చిరంజీవి. ఈ క్రమంలో ఓ అభిమాని ట్విట్టర్ లో ఇలా ఓపెన్ లెటర్ పోస్ట్ చేసారు.
చిరంజీవి గారు
ఒక సినిమాలో ఆ తార కాకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించినప్పుడు అది అసలి నటన. కన్యాశుల్కంలో NTR కనిపించడు. గిరీశం మాత్రమే కనిపిస్తాడు. చంటబ్బాయి లో చిరంజీవి కనిపించడు. పాండురంగా రావు మాత్రమే ఉంటాడు. నాకు ఆ చిరంజీవి కావాలి.
ఆ రుద్రవీణ సూర్యం కావాలి. ఆ గాంగ్ లీడర్ రాజారాం కావాలి. ఈ ఖైదీ 150, సైరా, లూసిఫెర్ ఒద్దు! తెలుగు వాళ్ళకి సినిమా పిచ్చి సార్! లూసిఫెర్ మేము ఎప్పుడో చూసేసాం. అయినా మోహన్ లాల్ మనోడే. పృద్ధ్విరాజ్ మనోడే! మళ్ళీ అదే కథ మీతో చూసి ఏం చేయమంటారు?
అయినా రీ మేకులే తప్ప మన దగ్గర కథలు లేవా? కథనాలు లేవా? మీరు ఏదో మాటవరసకి “అర్థాకలి” అంటూ ఉంటారు గాని, మీకు ఆకలే లేదు. ఆ సూర్యం పాత్రలో “నేను సైతం” అంటూ బయటకొచ్చే నటుడు నాకు కనిపించట్లేదు. ఖైది 150 కి మీరెందుకు సార్? మీ రేంజ్ ఏంటి మీరు చేసే కథలేంటి? ఇంకెన్ని రోజులండి ఈ కథలు రాయడం రాని కథకులతో. వీళ్ళు సీన్లు తీయడంలో సినిమాని మర్చి పోయారు. మీరు పస్తు ఉండండి కొన్ని రోజులు. చిరంజీవి కనిపించకుండా నటించండి. అది చూడాలనుంది. తప్పుగా భావించకండి! మీకు అద్దం చూపించాలి మరి!
A short letter to @KChiruTweets pic.twitter.com/8TSViwYlJo
— Ananda Sangeetam (@anuswaram) September 22, 2021
End of Article