Ads
శుభ కార్యాలకి అందులోనూ ముఖ్యంగా పెళ్ళిళ్ళకి అతిధులు ముఖ్యం అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అతిథులు లేకుండానే అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక పెళ్లి లో ఒక అనుకోని అతిథి వచ్చి ఆ జంటను ఆశీర్వదించారు. ఇందులో వింతేముంది అనుకోకండి. పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.
Video Advertisement
సాక్షి కథనం ప్రకారం ములుగు జిల్లా లోని మంగపేట్ మండలం లోని మల్లూరు లో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. వధూవరులు నూగురు వెంకటాపురానికి చెందినవారట. వధూవరులిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో ఒక కోతి వచ్చి ఆ జంటను ఆశీర్వదించింది. సడన్ గా అలా కోతి రావడం తో అక్కడున్న వారందరికీ ఏం జరుగుతోందో అర్థం అవ్వలేదు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా ముందు కొంచెం భయపడ్డారు.
కానీ తర్వాత ఆ కోతి పెళ్లికూతురిని, పెళ్ళికొడుకు ని ఆశీర్వదించడం తో అందరూ సంతోషపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వచ్చి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు జంటను ఆశీర్వదించారు అని అంటున్నారు.
End of Article