సోషల్ మీడియా పవర్ అంటే ఇదే అనుకుంటా…వృద్ధ దంపతులను ఆదుకున్న ఒకే ఒక్క పోస్ట్.!

సోషల్ మీడియా పవర్ అంటే ఇదే అనుకుంటా…వృద్ధ దంపతులను ఆదుకున్న ఒకే ఒక్క పోస్ట్.!

by Mohana Priya

Ads

సోషల్ మీడియా అంటే మనలో చాలా మందికి ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. చాలా మంది సోషల్ మీడియా ని మిస్ యూజ్ చేయడం, ఇంకా వాళ్ళు ఆలా మిస్ యూజ్ చేసి సోషల్ మీడియా ద్వారా చేసే కొన్ని పనుల వాళ్ళ ఎందరో ఎఫెక్ట్ అవ్వడం. ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి సోషల్ మీడియా పేరు వింటే అంత పాజిటివ్ గా ఆలోచించలేం.

Video Advertisement

కానీ సోషల్ మీడియా ద్వారా మంచి పనులు కూడా చేయొచ్చు. ఇది కూడా చాలా మందికి తెలుసు. కానీ మంచి కంటే చెడు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా నెగిటివ్ కోణం నుండే ఆలోచిస్తాం. అయితే, ఇటీవల జరిగిన ఒక సంఘటన ద్వారా ఒక మంచి ఆలోచన ఉంటే, అది అందరికి చెప్పాలి అనుకుంటే సోషల్ మీడియా ఎంతో పవర్ ఫుల్ మాధ్యమం అనే విషయం రుజువు అయ్యింది. వివరాల్లోకి వెళితే.

https://www.instagram.com/tv/CGDAHGxlGTv/?utm_source=ig_web_copy_link

ఒక 80 సంవత్సరాల వృద్ధ జంట ఢిల్లీ లో బాబా కా ధాబా అనే హోటల్ (ఫుడ్ కోర్ట్) నడుపుతున్నారు. కరోనా కారణం గా వారి వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసారు. ఇది చూసిన ఎంతో మంది ఆ వీడియో ని షేర్ చేసారు. ఇంకా చాలా మంది బాబా కా ధాబా కి వెళ్లడం మొదలు పెట్టారు .

అంతేకాకుండా రణదీప్ హుడా, సోనాక్షి సిన్హా, చిన్మయి ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఆ వీడియో షేర్ చేశారు. దాంతో చాలామంది తమ వంతు సహాయాన్ని అందించడానికి, అలాగే ఢిల్లీ లోని బెస్ట్ మటర్ పనీర్ రుచి చూడడానికి బాబా కా ధాబా కి వెళుతున్నారు. దాంతో ఆ వృద్ధ దంపతుల వ్యాపారం కూడా మెరుగు పడుతోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like