ఓటిటిలో హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ బ్లాక్ బస్టర్‌ థ్రిల్లర్‌ చూసారా.? స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటిటిలో హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ బ్లాక్ బస్టర్‌ థ్రిల్లర్‌ చూసారా.? స్ట్రీమింగ్ ఎందులో అంటే?

by Mounika Singaluri

Ads

మలయాళ సినిమాలు కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది వారు తీసే సినిమాలు పలు భాషలో రీమేక్ అవుతూ ఉంటాయి. ఓటిటి లు పుణ్యమా అంటుఅన్ని భాషల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తాజాగా మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన ఎ రంజిత్ సినిమా ఇప్పుడు ఒటిటిలోకి వచ్చేసింది.

Video Advertisement

డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. నిషాంత్ సత్తు తెరకెక్కించిన ఎ రంజిత్‌ సినిమా గతంలో తెలుగులో వచ్చిన ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌ను పోలి ఉంటుంది. ఇందులో ఆసిఫ్ అలీ, సైజు కురుప్, అన్సన్ పాల్, నమితా ప్రమోద్, జువెల్ మేరీ, హన్నా రెజి కోశి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆసక్తికరంగా సాగే స్ర్కీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో ఎ రంజిత్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధ రాత్రి నుంచే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో స్ట్రీమింగ్‌ కు రానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.


End of Article

You may also like