“చేతిలో బల్బ్ పెట్టారేంట్రా..?”… ఛత్రపతి “బెంగాలీ” వెర్షన్ నుండి వైరల్ అవుతున్న ఈ సీన్ చూస్తే నవ్వాపుకోలేరు..!

“చేతిలో బల్బ్ పెట్టారేంట్రా..?”… ఛత్రపతి “బెంగాలీ” వెర్షన్ నుండి వైరల్ అవుతున్న ఈ సీన్ చూస్తే నవ్వాపుకోలేరు..!

by Mohana Priya

Ads

రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా వచ్చిన “ఛత్రపతి” మూవీ ని మనం అంత ఈజీగా మరచిపోలేము. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచింది.ఈ సినిమా 2005 లో విడుదల అయింది. శ్రీయ ఈ సినిమాలో హీరోయిన్ నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Video Advertisement

ఒక తల్లి, ఇద్దరు కొడుకులు జీవితంలో ఏమి జరిగింది.. సవతి కొడుకైన హీరో తల్లికి ఎలా దూరం అవ్వాల్సి వచ్చింది.? తిరిగి తల్లిని వెతకడానికి అతను ఎన్ని పాట్లు పడతాడు? చివరకు ఎలా తల్లికి చేరువవుతాడు అన్న పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.

a scene from chatrapathi bengali version goes viral

తల్లి కొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కూడా గట్టిగానే పండాయి. ఇక మ్యూజిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఈ సినిమాను హిందీలో డబ్ చేసినా కూడా మంచి యూట్యూబ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వీవీ వినాయక్ దర్శకత్వం వస్తున్నారు. రెజీనా కాసాండ్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ ఫొటోస్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

a scene from chatrapathi bengali version goes viral

అయితే, ఈ సినిమాని అంతకముండు బెంగాలీలో రెఫ్యూజీ పేరుతో, కన్నడలో ఛత్రపతి పేరుతో రీమేక్ చేసారు. బెంగాలీలో ప్రొసెన్‌జిత్ హీరోగా నటించారు. తెలుగు నటి రంభ హీరోయిన్‌గా నటించారు. కన్నడలో సిద్దార్థ్, ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా నటించారు. బెంగాలీ వెర్షన్‌కి సంబంధించిన సీన్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో హీరోకి, కాట్రాజుకి మధ్య వచ్చే సీన్ తెలుగులో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ బెంగాలీ వెర్షన్‌లో మాత్రం ఎదో ట్రోల్ చేసినట్టు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

 


End of Article

You may also like