Ads
మనలో చాలా మంది రోజు వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యల్లో ఇంటర్నెట్ సమస్య ఒకటి. ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఇంటర్నెట్ స్లో అవడం జరుగుతూనే ఉంటుంది. దాంతో చాలా మంది చిరాకు పడుతుంటారు. ఒకవేళ ఏదైనా సబ్మిషన్, లేదా ఇంకేమైనా వివరాలు ఎంటర్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ స్లో అయితే, లేదా సిగ్నల్ ప్రాబ్లం వల్ల సరిగ్గా రాకపోతే వివరాలను మళ్ళీ మళ్ళీ ఎంటర్ చేయడం, అలాగే ఎంటర్ చేసిన వివరాలను మళ్లీ మళ్లీ సబ్మిట్ చేయడం చేస్తూ ఉంటాం.
Video Advertisement
మనం అలా చిరాకులో చేసే పనులు ఊహించని సంఘటనలకు దారితీస్తాయి. దానికి ఇటీవల జరిగిన ఈ సంఘటన ఉదాహరణ. ఫిలిప్పీన్స్ కి చెందిన ఒక 7 సంవత్సరాల అమ్మాయి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇంటర్నెట్ స్లో గా ఉండటంతో డీటెయిల్స్ కన్ఫర్మేషన్ బటన్ మళ్లీ మళ్లీ నొక్కింది. అలా తనకి, వాళ్ల బామ్మకి రెండు ఆర్డర్లు ప్లేస్ చేసింది.
తర్వాత కాలింగ్ బెల్ మోగింది. ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది అని ఆ అమ్మాయి వెళ్లి తలుపు తీసింది. తలుపు తీసి చూస్తే దాదాపు 30 మంది డెలివరీ బాయ్స్ లైన్ లో నిలబడి ఉన్నారు. ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేదు. తన ఫోన్ లో ఆర్డర్ డీటెయిల్స్ లో చూస్తే 42 సార్లు ఫుడ్ ఆర్డర్ చేసినట్టు ఉంది.
అంటే స్లో ఇంటర్నెట్ కారణంగా ఆ అమ్మాయి చాలా సార్లు కన్ఫర్మేషన్ చేయడంతో నలభై రెండు సార్లు ఆర్డర్ ప్లేస్ అయింది. ఆ అమ్మాయికి కావాల్సింది రెండు ఆర్డర్స్ మాత్రమే. కానీ మిగిలిన 40 ఆర్డర్స్ ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి వాళ్లకి వీలు ఉన్నన్ని ఆర్డర్స్ కొనుక్కున్నారు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి వాళ్ళ పక్కింట్లో ఉండే సుఆరెజ్ అనే ఆవిడ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video:
End of Article