Ads
కృష్ణా జిల్లాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన వివాదాలకు దారి తీసింది. కృష్ణా జిల్లాలోని జి.కొండూరు లో ఒక మాంసం దుకాణం వద్ద కేజీ వేట మాంసం 200 రూపాయలు మాత్రమే అని బోర్డు పెట్టారు. దాంతో ప్రజలు అందరూ దుకాణం వద్ద లైన్ కట్టారు. దుకాణం వాళ్ళు, వేట మాంసం కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు ఆధార్ కచ్చితంగా తీసుకురావాలి అని కండిషన్ పెట్టారు. అయితే మరుసటి రోజు మాత్రం మామూలు రేట్ కి అమ్మారు . దాంతో ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Video Advertisement
ముందు ఒకరోజు ఒక ధరకు అమ్మి తర్వాత రోజు ఇంకొక ధరకు అమ్మడం ఏంటి? అని కొంతమంది అంటే మరికొంతమంది మాత్రం అవి చచ్చిపోయిన గొర్రెలు అని అంటున్నారు. నిన్న 200 అని ధర పెట్టి ఇవాళ 600 పెట్టారు అంటూ, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. అంతేకాకుండా వాళ్ల వ్యాపారం లో అభివృద్ధి చెందడం కోసం చచ్చిపోయిన జీవాల్ని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు అని,
representative image
అసలు కేజీ మటన్ రెండు వందల రూపాయలకు అమ్మడం వెనకాల ఎంత నిజం ఉందో బయటికి తీయాలని అధికారులను కోరుతున్నారు. ఇంకొంత మంది మాత్రం జి.కొండూరు లో వేట మాంసం అమ్మకాల్లో నాణ్యత ఉంటుంది అని పేరు రావడంతో అక్కడ ఉన్న షాప్ ల మధ్య పోటీ పెరిగింది అని, అందుకే ధరలు తగ్గించి అమ్మారు అని, కానీ పరిస్థితి వేరే లాగా అయింది అని చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
End of Article