10 ఏళ్ల బాలిక కలలో కనిపించిన కృష్ణుడు.. ఆమె ఆమె చెప్పిందని “దర్గా” దగ్గరలో తవ్వగా ఏం కనిపించిందంటే.?

10 ఏళ్ల బాలిక కలలో కనిపించిన కృష్ణుడు.. ఆమె ఆమె చెప్పిందని “దర్గా” దగ్గరలో తవ్వగా ఏం కనిపించిందంటే.?

by kavitha

Ads

దేవుడు కలలో కనిపించి, ఫలానా ప్రాంతంలో తన విగ్రహం ఉందని చెప్పడం స్టోరీలలో కానీ, సినిమాలలో కానీ  చెప్పడం గురించి అందరు వినే ఉంటారు. అయితే నిజ జీవితంలో కూడా అలాంటి ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్​లో చోటుచేసుకుంది.

Video Advertisement

శ్రీ కృష్ణుడు యూపీలోని ఒక బాలికకు కలలో కనపడి తన విగ్రహం ఉన్న చోటు గురించి తెలిపి, బయటికి తీయమని చెప్పడంతో స్థానికులు బాలిక చెప్పిన చోటులో తవ్వకాలు జరిపించారు. అక్కడ బాలిక చెప్పినట్టుగానే కృష్ణుడి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహన్ని దర్శించుకోవడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సఫోరా గ్రామానికి  చెందినటువంటి వినోద్ ఠాకుర్ తన ఫ్యామిలితో కలిసి పిలిభిత్​ జిల్లాలో జీవిస్తున్నారు. అతని కుమార్తె పూజా ఠాకుర్ 8వ తరగతి చదువుకుంటోంది.  సంవత్సరం నుండి శ్రీకృష్ణుడు కలలో కనిపిస్తున్నాడని పూజ చెప్పింది. ఈ క్రమంలో నెల రోజులు నుండి పూజకు కలలో జింద్‌పూర్ లోని దర్గాకు దగ్గరలోని భూమిలో కృష్ణుడి విగ్రహం ఉన్నట్టు కనిపించింది. దాంతో ఆమె తనకు వచ్చిన  కల గురించి తల్లిదండ్రులకు చెప్పింది.

అయితే వారు పూజ కలను పట్టించుకోలేదు. మిగతా కుటుంబ సభ్యులతో పాటు ఎవరూ కూడా పూజ మాటలను పట్టించుకోలేదు. కానీ పూజ తన కలను నిజమని నమ్మి, తాను చెప్పిన స్థలంలో తవ్వి కృష్ణుడి విగ్రహాన్ని వెలికితీసే వరకు ఆహారం తీసుకోనంటూ నిరాహార దీక్ష ప్రారంభించింది.  వారం రోజుల నుండి పూజ నిరాహార దీక్ష చేసింది. ఆమె దీక్షను చూసిన వినోద్ మరియు వారి కుటుంబ సభ్యులు, స్థానీకులతో పాటు దర్గా దగ్గరకు వెళ్లారు. తవ్వకాల చేపట్టడంతో ఇతర సంఘాలు అడ్డుకోవడంతో అక్కడ  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ముందుజాగ్రత్తగా దర్గా వద్ద ఏర్పాటుచేసిన పోలీసు బందోబస్తు మధ్య ఇరువైపుల ప్రజలు వచ్చిన తరువాత పూజ చెప్పిన చోట తవ్వకాలు చేపట్టారు.  కాస్త తవ్వగానే కృష్ణుడి విగ్రహం బయటపడింది. గ్రామస్తులు ఆ విగహాన్ని అక్కడి నుంచి తీసి, రెండున్నర కి.మీ. దూరంలో ఉన్న పొలంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: మేడారం జాతరలో అది నిషిద్ధం అంటూ ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కామెంట్స్..!

 


End of Article

You may also like