“వెంకటేష్”తో ఆ “స్టార్ డైరెక్టర్” సినిమా అనౌన్స్ చేసారా..? ఇన్ని సంవత్సరాలైనా అప్‌డేట్‌ లేదేంటి..?

“వెంకటేష్”తో ఆ “స్టార్ డైరెక్టర్” సినిమా అనౌన్స్ చేసారా..? ఇన్ని సంవత్సరాలైనా అప్‌డేట్‌ లేదేంటి..?

by Megha Varna

Ads

వెంకటేష్ కి టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ కూడా వెంకటేష్ కొత్తగా ఉన్న సినిమాలు ఎంపిక చేసుకుని నటిస్తూ ఉంటారు. అలాగే వెంకటేష్ కొత్త కొత్త హీరోయిన్స్ ని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఎంతో మంది హీరోయిన్స్ ని వెంకటేష్ ఇండస్ట్రీ లోకి తీసుకు వచ్చారు.

Video Advertisement

ఖుష్బూ, దివ్య భారతి, టబు మొదలైన హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు వెంకటేష్. అలానే వెంకటేష్ మొన్న మొన్న వచ్చిన సినిమాల్లో కూడా అద్భుతమైన హిట్లను అందుకున్నారు.

వెంకటేష్ నటించిన నారప్ప సినిమా భారీ హిట్ ను అందుకుంది. అలానే వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రం కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రేక్షకులు ఎఫ్ 3 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎఫ్ 3 సినిమా కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా తమన్నా వరుణ్ తేజ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు.

అలానే హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ కూడా ఇందులో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాలుగేళ్ల క్రితం వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతోంది అని చెప్పారు.

కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ఆ చిత్రం ఊసేలేదు. దీనిపై తాజాగా మీమ్స్ కూడా వస్తున్నాయి. చాలా చిత్రాలు వస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన అప్డేట్ ఏమీ లేదు. నిజానికి ఈ సినిమా వస్తుందా రాదా అనేది కూడా ఇంకా చెప్పలేదు. అనౌన్స్ చేసి నాలుగేళ్లు అవుతోంది. ఒక అప్డేట్ అయినా రాలేదు.


End of Article

You may also like