రైల్వే చరిత్రలోనే తొలిసారి…ఒక మహిళ కోసం 535 కి.మీలు ప్రయాణించిన రైలు.! అసలేమైంది?

రైల్వే చరిత్రలోనే తొలిసారి…ఒక మహిళ కోసం 535 కి.మీలు ప్రయాణించిన రైలు.! అసలేమైంది?

by Mohana Priya

Ads

లాతేహర్ జిల్లాలోని తోరి లో తానా భగత్స్ రైల్వే ట్రాక్‌ వద్ద ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఆందోళనల కారణంగా రాజధాని ఎక్స్ప్రెస్ రైలు డాల్టన్ గంజ్ దగ్గర ఆగిపోయింది. కొంచెం సేపటి తర్వాత పరిస్థితి మామూలుగా అయిపోతుంది అని అప్పుడు రైలు తిరిగి రాంచీ కి ప్రయాణం అవుతుంది అని అధికారులు అనుకున్నారు. కానీ ఆందోళన కొనసాగడంతో రైల్వే బోర్డు చైర్మన్ కు సమాచారం అందించారు.

Video Advertisement

ఆ ట్రైన్ లో 930 మంది ప్రయాణికులు ఉన్నారు. రైల్వే బోర్డు చైర్మన్ ట్రైన్ లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బస్సుల ద్వారా రాంచీకి పంపాలని ఆదేశించారు. దాంతో ప్రయాణికులందరూ బస్సులో రాంచీ కి బయలుదేరారు. కానీ అనన్య అనే ఒక యువతి మాత్రం బస్సులో ప్రయాణించడానికి నిరాకరించారు. తను బస్సు లో వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ టికెట్ ఎందుకు తీసుకుంటాను అని, టికెట్ మీద రాజధాని ఎక్స్ప్రెస్ అని ఉంది అని, ట్రైన్లోనే రాంచీ కి వెళ్తాను అని అన్నారు.

రైల్వే యాజమాన్యం అనన్యను కారులో పంపాలని ప్రతిపాదించినా కూడా అనన్య అందుకు ఒప్పుకోలేదు. దాంతో రైల్వే బోర్డు చైర్మన్ కు ఈ విషయం చెప్పారు. చర్చలు జరిగిన తర్వాత అనన్యను భద్రతా ఏర్పాట్లతో రాజధాని ఎక్స్ప్రెస్ ద్వారా రాంచీ కి పంపమని డి ఆర్ఎం ను ఆదేశించారు. అనన్య ను జాగ్రత్తగా తన గమ్యస్థానానికి చేర్చడానికి ఆర్పిఎఫ్ మహిళా సైనికులని నియమించారు.

డాల్టన్ గంజ్ నుంచి రాంచీకి 308 కిలోమీటర్ల దూరం ఉంది. సాధారణంగా అయితే ఈ ట్రైన్ రణత్ గంజ్ నుండి రాంచీకి వెళ్లాలి. కానీ ట్రైన్ గయా, అక్కడి నుండి గోమో ఇంకా బొకారో మీదుగా రాంచీ కి మొత్తం 535 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. 25 సంవత్సరాల నుండి రైల్వే శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి మాట్లాడుతూ ఒక ప్రయాణికుల కోసం 535 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం రైల్వే చరిత్రలో ఇదే మొట్టమొదటి సారి అని అన్నారు.


End of Article

You may also like