Ads
ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు ఎడిక్ట్ అయిన డ్రింక్ (పానీయం) ఏంటో తెలుసా? మనలో చాలా మందికి ఈ ప్రశ్న వినగానే కచ్చితంగా సమాధానం ఆల్కహాల్ అని అనిపిస్తుంది. కానీ కాదు. ఆల్కహాల్ లేకపోయినా ఒకరోజు ఉండగలరేమో గాని. టీ లేకపోతే ఎంతో మందికి రోజు కూడా కదలదు.
Video Advertisement
కొంతమందికి పొద్దున లేవంగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి సాయంత్రం టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఒక్కరోజులో సమయం గురించి కూడా ఆలోచించకుండా ఎప్పుడు తాగాలి అనిపిస్తే అప్పుడు టీ తాగుతూనే ఉంటారు.
మనుషులే కాకుండా బల్లి కూడా టీ కి ఎడిక్ట్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే. ఒకరోజు భరత్ పూర్ లోని ఒక కుటుంబం లో ఒక మహిళ తన కుటుంబ సభ్యుల కోసం టీ చేసింది. టీ కప్పులను టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న ఒక బల్లి వచ్చి టీ కప్ మీదకి వాలి టీ తాగడం మొదలు పెట్టింది.
ఇదంతా ఆ మహిళ చూసింది. ఆ బల్లి పై జాలిపడి అప్పటినుండి రోజు బల్లి కోసం కూడా ప్రత్యేకంగా టీ కప్పులో పోసి పెడుతోంది. దాదాపు రెండు నెలల నుండి బల్లి వచ్చి తన కోసం కప్ లో పోసి పెట్టిన టీ తాగి వెళ్తోంది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బల్లి టీ తాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video:
https://youtu.be/o8eUDVY_inI
End of Article