Home Viral ఆంటీ అని పిలిచినందుకు చితకబాదిన మహిళ…వైరల్ వీడియో వెనకున్న అసలు కథ ఇదే.!

ఆంటీ అని పిలిచినందుకు చితకబాదిన మహిళ…వైరల్ వీడియో వెనకున్న అసలు కథ ఇదే.!

by Mohana Priya

సాధారణంగా కొంతమంది ఎవరినైనా పిలవాలంటే ఆంటీ లేదా అంకుల్ అని పిలుస్తారు. వాళ్ళు వయసులో తమ కంటే ఎంత పెద్ద అనే విషయాన్ని అసలు పట్టించుకోరు. ఒక నాలుగైదు సంవత్సరాలు తేడా ఉన్నా కూడా ఆంటీ లేదా అంకుల్ అని పిలుస్తారు. చాలా మందికి ఇలా పిలిస్తే కోపం వస్తుంది.

కొంత మంది విని వదిలేస్తారు. కొంత మంది మాత్రం అలా పిలవద్దు అని చెబుతారు. ఇంకొంత మంది అయితే కొంచెం గట్టిగానే రిప్లై ఇస్తారు. ఒక్కొక్కసారి చేతులకి కూడా పని చెప్తారు. దానికి ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లోని ఈటా లో బాబూగంజ్ మార్కెట్ ‌లో షాపింగ్ చేసుకుంటున్న ఒక మహిళను అక్కడే ఉన్న ఒక యువతి ఆంటీ అని పిలిచింది.

దాంతో కోపం తెచ్చుకున్న ఆ మహిళ ఆ యువతిని కొట్టడం మొదలు పెట్టింది. ఇంకొంత మంది మహిళలు కూడా ఆ మహిళకి సహాయం చేశారు. అక్కడే ఉన్న ఒక లేడీ పోలీస్ రంగంలోకి దిగి గొడవని ఆపారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

https://www.youtube.com/watch?v=KhHT9ba3x5Y

 

You may also like