Ads
కొంతమంది ఉద్యోగులు పనిచేసామా, జీతం తెచ్చుకున్నామా అనే ఒరవడితోనే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం తీసుకున్న జీతానికి న్యాయం చేస్తూ ఉంటారు. మొన్న ఒక కానిస్టేబుల్ అలాగే బాధ్యతగా ప్రవర్తించి పురుగుల మందు తాగిన రైతుని రెండు కిలోమీటర్లు భుజాన మూసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లి రక్షించిన సంగతి అందరికీ తెలిసిందే.
Video Advertisement
ఇప్పుడు అలాంటి బాధ్యత గల ఒక మహిళ ఉద్యోగి బాధ్యతగా ప్రవర్తించి అందరిచేత శభాష్ అనిపించుకుంటుంది. ఎవరా అమ్మాయి? ఏం చేసింది? వివరాల్లోకి వెళ్దాం. ఒకప్పుడు మహాత్మా గాంధీ అన్నట్టు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాట సీఎం జగన్ అక్షరాల నిజం చేస్తున్నారనే చెప్పొచ్చు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు ఇవాళ్లంటీర్లకు వ్యవస్థ దేశానికి తలమానికంగా నిలుస్తుంది. లబ్ధిదారులకు ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్లు అందించే ప్రక్రియ ఎంతో మంది వృద్ధులకు మేలు కలిగిస్తుంది. వాలంటీర్లు కూడా ఎంతో బాధ్యతగా పింఛనుదారులు వేరే ప్రాంతాలలో ఉన్నప్పటికీ ఎన్నో ప్రయాసలకు తట్టుకొని వెళ్లి పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది సొంత ఖర్చులు పెట్టుకొని మరీ అక్కడికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి కూడా ఆ కోవకు చెందిన అమ్మాయే.
అల్లూరు సీతారామరాజు జిల్లా పాటిగరువుకు చెందిన గ్రామ వాలంటీర్ కిరసాయిని రోజా రాణి తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. శుక్రవారం ఆమె పెళ్లి బంధుమిత్రులు అందరూ వచ్చారు. అయితే ఆ రోజు ఒకటో తారీకు కావటంతో పింఛను దారులు ఎంతో ఆత్రుతగా వారికి రావలసిన పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే రోజా రాణి కీలకమైన నిర్ణయం తీసుకుంది. తన పెళ్లి కన్నా ముందు పింఛన్దారులకు కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకుంది. అందుకోసం తన పెళ్లి సంబరాలను పక్కనపెట్టి ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చింది. పెళ్లి బట్టల లోనే లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసింది. నిజంగా ఆమె డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
End of Article