Ads
చాలా మంది ఆడవాళ్లకి సంతానం కావాలి అని ఉంటుంది. వారిలో కొంత మందికి వెంటనే సంతానం కలగగా, కొంత మందికి మాత్రం సమయం పడుతుంది. అలా కొంత మంది సంతానం కోసం ఎంతో మంది డాక్టర్లను ఆశ్రయించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలా ఒక మహిళ ఇటీవల తన పెళ్లి అయిన 23 సంవత్సరాలకి తల్లి అయ్యారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్ పూర్ కి చెందిన 42 సంవత్సరాల స్వరూప, తన భర్త శ్రీనివాస్ కి పెళ్లి 23 సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. సంతానం కోసం ఎన్నో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు సంవత్సరం క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఎన్నో లక్షలు ఖర్చు చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించారు. తర్వాత స్వరూప గర్భవతి అయ్యారు.
జూలై 19 వ తేదీన మెట్ పల్లి లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చారు స్వరూప. అయితే, ఇద్దరు పిల్లలు బరువు తక్కువగా ఉండడంతో పుట్టిన వెంటనే వారిద్దరిని అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ లో ఉన్న ఒక పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నప్పుడు మెట్ పల్లి లోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్ కి వెళ్లారు.
representative image
కానీ స్వరూప కి ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్ లోనే మరొక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలా ఇన్ఫెక్షన్ కి చికిత్స పొందుతున్న స్వరూప బుధవారం మరణించారు. దీంతో 23 సంవత్సరాల తర్వాత వారికి సంతానం కలిగింది అని సంతోషంగా ఉన్న కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
End of Article