12 సంవత్సరాలుగా ప్రేమించిన వ్యక్తి ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకోవడంతో ఆ యువతి తన జీవితాన్ని అంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, తమిళనాడులోని ధర్మపురి ప్రాంతానికి చెందిన మురళీధరన్, జ్ఞానమొళి వరసకి బావమరదళ్ళు అవుతారు. చిన్నప్పటి నుంచి వారిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు భావించారు. వారిద్దరూ ఇంజనీరింగ్ పూర్తిచేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.A woman in Dharmapuri took her life in front of her boyfriend house

కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం ప్రకటించడంతో ఇద్దరూ వారి ఇళ్లకు వెళ్లిపోయారు. అంతకుముందు ఉద్యోగాలు చేస్తూ బెంగళూరులో వారిద్దరు ఒకటే ఇంట్లో కలిసి ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. జ్ఞానమొళి రెండు సార్లు అబార్షన్ కూడా చేయించుకున్నారు. తర్వాత మురళీధరన్ తల్లిదండ్రులు అతనికి వేరే యువతితో పెళ్లి ఖరారు చేశారు.A woman in Dharmapuri took her life in front of her boyfriend house

ఈ విషయం తెలిసిన జ్ఞానమొళి మురళీధరన్ ఇంటికి వెళ్లి మాట్లాడారు. తల్లిదండ్రులు జ్ఞానమొళి మాట వినలేదు. మురళీధరన్ కూడా తన తల్లిదండ్రుల మాటకి కట్టుబడి ఉంటాను అని చెప్పడంతో జ్ఞానమొళి మురళీధరన్ ఇంటి ముందే తనతో పాటు తెచ్చుకున్న విషాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది చూసిన స్థానికులు జ్ఞానమొళిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.

representative image

జ్ఞానమొళి ఆత్మహత్యకి మురళీధరన్, తన కుటుంబం కారణం అని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. ఆ కుటుంబంపై తగిన చర్యలు తీసుకునేంతవరకు జ్ఞానమొళి మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదు అని జ్ఞానమొళి కుటుంబం. బంధువులు చెప్పారు. దాంతో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్ఞానమొళి ఆత్మహత్యకి కారణమైన వారికి శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు దాంతో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు.