వింత వింత వీడియోలకి, విషయాలకి అన్నిటికి ఒకటే వేదిక. అదే సోషల్ మీడియా. ఇందులో చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు వరకు అన్ని ఉంటాయి. ఇందులో కొన్ని మాత్రం చాలా వింతగా అనిపిస్తాయి. అలా ఇటీవల ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఒక యువతి మేకతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించింది. ఆ మేక ఒక తాడుతో కట్టేసి ఉంది. సెల్ఫీ దిగుతున్న యువతికి కొంచెం దూరంలో ఉన్న మేక ఆ తాడుని విదిలించుకొని రావడానికి ప్రయత్నించింది.

woman tries to take selfie with goat

అలానే చాలా సార్లు ప్రయత్నించింది. ఆ యువతి మాత్రం సెల్ఫీ దిగటానికి తన కెమెరా యాంగిల్స్ సరి చేసుకుంటూ ఉంది. అలా సెల్ ఫోన్ తో ఫోటో తీస్తున్నప్పుడు సడన్ వెనుక నుంచి ఆమె ఒక వచ్చి ఆ యువతి తలను బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ యువతి కిందపడిపోయింది. ఈ వీడియోని ట్విట్టర్ లో ద డార్విన్ అవార్డ్స్ అనే పేజ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :