Ads
సాధారణంగా మనలో చాలా మంది పాము చూస్తేనే భయపడతాం. పాము అనే పేరు వినగానే పరిగెడతాం. అలాంటిది ఒక మహిళ పాములని సునాయాసంగా పట్టుకుంటారు. వివరాల్లోకి వెళితే. నిర్జరా చిట్టి కర్ణాటక లోని బెల్గాం లో నివసిస్తారు. నిర్జరా చిట్టి ఎంత పెద్ద పాముని అయినా సరే జాగ్రత్తగా పట్టుకొని, అంతే జాగ్రత్తగా జన సంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి వదిలేస్తారట. ఇంకొక విషయం ఏంటంటే నిర్జరా చిట్టి ఎటువంటి పరికరం ఉపయోగించకుండా కేవలం చేతితోనే పాముని పట్టుకోగలుగుతారట.
Video Advertisement

ఒక రోజు నిర్జరా చిట్టి ఫంక్షన్ కి వెళ్లడానికి తయారయ్యారట. అప్పుడే తనకి ఒక ఇంట్లో కి పాము వచ్చింది అని ఫోన్ వచ్చిందట. ఫోన్ రాగానే ఎమర్జెన్సీ అవడంతో ఫంక్షన్ కి వెళ్లడానికి చీర కట్టుకుని తయారైన నిర్జరా చిట్టి అలాగే చీరలోనే వెళ్లారట. సంచి (బస్తా) వెనకాల ఉన్న ఆ పాముని బయటికి తీసి, మెల్లగా పాము ని చేతితో పట్టుకుని బయటికి తీసుకొచ్చారు నిర్జరా చిట్టి.

ఈ సంఘటన గత సంవత్సరం లో జరిగిందట. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్జరా చిట్టి ని ప్రశంసిస్తున్నారు. టైమ్స్ నౌ న్యూస్ కథనం ప్రకారం నిర్జరా చిట్టి భర్త ఆనంద్ చిట్టి కూడా వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ అట.
A friend just informed me that her name is Nirzara Chitti. 🙏
— Dr. Ajayita (@DoctorAjayita) September 12, 2020
End of Article
