Ads
- చిత్రం : CSI సనాతన్
- నటీనటులు : ఆది సాయి కుమార్, మిషా నారంగ్, నందిని రాయ్.
- నిర్మాత : అజయ్ శ్రీనివాస్
- దర్శకత్వం : శివశంకర్ దేవ్
- సంగీతం : అనీష్ సోలమన్
- విడుదల తేదీ : మార్చ్ 10, 2023
Video Advertisement
స్టోరీ :
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వడ్డీలేని రుణాలు అని పెద్ద స్థాయి కి వచ్చిన ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ వీసీ గ్రూప్ సీఈవో విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) హత్య చేస్తారు. ఆఫీసులో ఓ పార్టీలో షూట్ చేస్తారు. ఈ కేసు ని క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన సనాతన్ (ఆది సాయి కుమార్) కి అప్పగించడం జరుగుతుంది. విక్రమ్ తో పాటు వాళ్ళ కంపెనీ లో వున్నా కంపెనీ పార్టనర్ దివ్య, ఉద్యోగులు లాస్య, సుదీక్ష ని అనుమానిస్తారు.
మంత్రి రాజవర్ధన్ కూడా ఈ కంపెనీ భాగస్వామని తెలుస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఈ కేసు ని సాల్వ్ చేసే క్రమం లో ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా అతని మాజీ ప్రేయసి కూడా అదే చోట పని చేస్తుంది. వీళ్ళు ఎందుకు విడిపోయారు, రాజవర్ధన్ పీఏ చోటా ఎలా చనిపోయాడు… ఒక్క రూపాయి కూడా లేని విక్రమ్ పదేళ్ళలో ఐదు వేల కోట్ల కంపెనీకి సీఈవో ఏ విధంగా అయ్యాడు..?, విక్రమ్ చక్రవర్తిని ఎవరు చంపారు..? అనేది కథ. ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి.
రివ్యూ :
సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎలా ఉన్నా సరే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో ఆది సాయి కుమార్. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంటుంది. ఆది సాయి కుమార్ ఎంపిక చేసుకునే కథలు బాగుంటాయి. కానీ కథను స్క్రీన్ మీదకు వచ్చేటప్పుడు కొన్ని తప్పులు వచ్చాయి. అలనే బడ్జెట్ పరిమితులు కూడా స్క్రీన్ మీద కనపడుతున్నాయి. కనపడే సీన్స్ కి మళ్ళీ డైలాగ్స్ ఇచ్చి టైం వేస్ట్ చేసారు. కొన్ని సీన్స్ కూడా రిపీట్ అయ్యాయి. మధ్య తరగతి, పేద ప్రజలు వాళ్ళు మోసపోతున్న అంశాన్ని మర్డర్ మిస్టరీగా మార్చారు.
అసలు కథ అంతా కూడా రెండవ పార్ట్ లో క్లైమాక్స్ లో చూపించారు. లాజిక్స్ కొన్ని పట్టించుకోలేదు. క్లైమాక్స్ ట్విస్టులు అయితే బాగున్నాయి. ఈ మూవీ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అంతలా ఆకట్టుకోలేదు. థ్రిల్లింగ్ ఎలివేషన్స్ బాగాలేవు. ఇంకాస్త జాగ్రత్తగా చూసి తీసి ఉంటే బాగుండేది. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చాలా సీన్స్ ఆది చేసాడు.
ప్లస్ పాయింట్స్ :
- నటీ నటులు
- క్లైమాక్స్
- కథనం
మైనస్ పాయింట్స్:
- మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సిఎస్ఐ సనాతన్ సినిమా మీద ఏ అంచనాలు పెట్టుకోకుండా వెళితే టైం పాస్ అవుతుంది. థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్ట పడే వాళ్లకి నచ్చచ్చు.
watch trailer
End of Article