Ads
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆది కేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. డబ్ల్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఓ గుడి చుట్టూరు జరుగుతుందని వినికిడి. రుద్రకాళేశ్వర్ రెడ్డి గా శక్తివంతమైన పాత్రలో వైష్ణవ తేజ్ కనిపించనున్నారు.
Video Advertisement
మలయాళం నటుడు జోజు జార్జ్, అపర్ణ దాస్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్ర బృందం ఇటీవల ఇందులోని పాటలను విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభించింది. శ్రీ లీల వైష్ణవ తేజ్ డాన్సులు ఇరగదీసారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
ఈ సినిమాకి సంబంధించి నిర్మాత నాగ వంశీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 24వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. మొదటగా ఈ సినిమాని ఆగస్టు 18న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల నవంబర్ 10కి వాయిదా పడింది. అయితే నవంబర్15, 16 తేదీల్లో క్రికెట్ వరల్డ్ కప్ సెమి ఫైనల్స్ ఉన్న కారణంగా నవంబర్ 24కి వాయిదా వేసినట్లుగా తెలియజేశారు.
నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ తాను నిర్మించి విడుదల చేసిన మ్యాడ్, లియో చిత్రాలు గత వారంలో విడుదలయ్యాయి. అయితే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉన్న ప్రతి రోజు కూడా కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఆది కేశవ సినిమాని క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ అయిపోయాక విడుదల చేయడానికి నిర్ణయించినట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా నవంబర్ 10న మరో నాలుగు సినిమాలు ఉన్నందున పోటీ ఎందుకని భావించి పక్కకు జరిగినట్లుగా తెలిపారు.నవంబర్ 24 న ఈ సినిమాకి పోటీగా గీత ఆర్ట్స్ కోటబొమ్మాలి సినిమా కూడా రానుంది.
Also Read:వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి ఇంత ఖర్చు అయ్యిందా..? పెళ్లి బట్టల కాస్ట్ ఎంత అంటే..?
End of Article