Home Filmy Adda ఆది పురుష్ ఎఫెక్ట్ ”సలార్” పై పడుతుందా..?

ఆది పురుష్ ఎఫెక్ట్ ”సలార్” పై పడుతుందా..?

by Megha Varna

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు.

manchu vishnu comments on prabhas aadipurush..

అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి నటన పై అవగాహన ఉంది. తెలుగు తో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ అంతకు ముందు తానాజీ సినిమాకి దర్శకత్వం వహించారు.

salar 1

అయితే ఈ సినిమా టీజర్ కాస్త నిరాశ పరిచింది. అందుకే ఈ సినిమా ని వచ్చే జూన్ నెలకు వాయిదా వేశారు. కాస్త సమయం తీసుకుని ఈ సినిమాను విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమాయే కాక ప్రభాస్ సలార్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఆలస్యం అయ్యేలా వుంది కనుక ఈ ఎఫెక్ట్ సలార్ మీద కూడా పడుతుందని అంటున్నారు. ఈ సినిమా వలన సలార్ కూడా వాయిదా పడే అవకాశం వుంది. ఈ రెండు సినిమాలూ కూడా భారీ బడ్జెట్ తో తీస్తున్నవే.

You may also like