లాక్ డౌన్ వేళ ఆహారం ఇవ్వటానికి వెళ్లి యాచకురాలిని పెళ్లి చేసుకున్నాడు.

లాక్ డౌన్ వేళ ఆహారం ఇవ్వటానికి వెళ్లి యాచకురాలిని పెళ్లి చేసుకున్నాడు.

by Megha Varna

ప్రేమ పుట్టడానికి కారణాలు ఉండవు అని చెప్తూ ఉంటారు.ప్రేమ అనేది ఎప్పుడు ,ఎక్కడ ,ఎలా మొదలవుతుందో తెలియదు గాని ఒక్కసారి ప్రేమ మొదలైతే మాత్రం ప్రేమకు ఏది అడ్డు రాదని చరిత్ర నుండి మనకు తెలుస్తుంది.అయితే తాజాగా కాన్పూర్ లో ఓ ఆటో డ్రైవర్ ఒక యాచకురాలిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.ఆ వివరాలేంటో చూద్దాం.

Video Advertisement

 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో నీలం నివాసం ఉంటుంది.చిన్నతనంలోనే తల్లితండ్రి మరణించడంతో తన అన్న దగ్గరే ఉండీ జీవనం సాగిస్తుంది నీలం.అయితే తాను ఇంట్లో ఉండడం తన అన్నకు మరియు వదినకు ఇష్టం లేదు.కాబట్టి తనని నేరుగా వెళ్లిపొమ్మని చెప్పలేక ఏదో రకంగా లేని పోనీ మాటలు అంటూ పలు రకాల వేధింపులకు గురిచేసేవారు.మొదట్లో అవి అన్ని ఎంతో ఓపికగా భరించిన నీలం తర్వాత ఆ వేధింపులను భరించలేక ఇంటి నుండి బయటకు వచ్చేసింది.తనకు తెలిసిన వృత్తి ఏమి లేకపోవడం చేరదీసేవాళ్ళు ఎవరూ లేకపోవడం వలన రోడ్ల మీదకు చేరి బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది నీలం.

సొంత వారే కసాయి వారీగా మారి ఇంట్లో నుండి నీలం ను గెంటేయడంతో ఎంతో బాధగా నీలం రోడ్ల మీద జీవిస్తూ ఉంది.అయితే ఈ క్రమంలో కరోనా వలన విధించిన లాక్ డౌన్ తో రోడ్ల మీదకు వచ్చి దానం చేసేవాళ్ళు కూడా లేకపోవడంతో నీలం పరిస్థితి మరి దయనీయ్యంగా తయారైంది.దీంతో ఆహారం దొరకక అలమటిస్తూ అలాగే రోడ్ పక్కన నివసించేది.ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా రోడ్ల పక్కన ఉండేవారికి చాలామంది ఆహారం అందించడానికి ముందుకు వస్తున్నారు.అయితే ఓ ఆటో డ్రైవర్ ఆహారం అందచెయ్యడానికి రోడ్ మీదకి వచ్చినప్పుడు నీలం కనిపించింది.

representative image

అయితే ఆ ఆటో డ్రైవర్ నీలం ను ఎందుకు నువ్వు ఇంత చిన్న వయసులో బిచ్చగత్తె గా మారావు అని అడిగాడు.దీంతో తన కథ అంతా కూడా నీలం ఆటోడ్రైవర్ తో పంచుకుంది.ఆ విధంగా వారి మధ్య పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో రోజు ఆమెకు ఆహారం అందించడానికి వచ్చి తనతో కాసేపు ముచ్చటించేవాడు.ఆ విధంగా వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.ఒక రోజు ఆ ఆటో డ్రైవర్ ఆ యాచకురాలిని నన్ను పెళ్లిచేసుకుంటావా అని అడిగాడు కాగా ఆమె కూడా వివాహానికి అంగీకరించడంతో వీరిద్దరి వివాహం జరిగింది.


You may also like

Leave a Comment