సౌందర్య చనిపోయిన నెల తరువాత వాళ్ళింటికి వెళ్ళా..ఎంట్రన్స్ లో చూసి..? ఆమని సంచలన కామెంట్స్..!

సౌందర్య చనిపోయిన నెల తరువాత వాళ్ళింటికి వెళ్ళా..ఎంట్రన్స్ లో చూసి..? ఆమని సంచలన కామెంట్స్..!

by Megha Varna

Ads

అలనాటి సౌందర్య.. సావిత్రి కి ఏమాత్రం తీసిపోరు. ఎక్స్పోజింగ్ తో కాకుండా అభినయం తో ఆకట్టుకున్న నటి ఆమె. చిన్న వయసులోనే వందకు పైగా సినిమాలలో నటించింది. తక్కువ సమయం లోనే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే, దురదృష్టవశాత్తు, ముప్పై ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి.

Video Advertisement

విమాన ప్రమాదం లో సౌందర్య మరణించారు. ఆమె మరణించినా.. ఇప్పటికీ, ఆమె సినిమాలను అభిమానించే వారి సంఖ్యా ఎక్కువే ఉంది.

soundarya amani

నేటికీ ఆమె సినిమా టీవీ లో వస్తోందంటే చూసే వారు చాలా మంది ఉన్నారు. ఆమె ఇప్పటికీ అభిమానుల గుండెల్లో బతికే ఉన్నారనిపిస్తుంది. ఆమె సినిమాలలో నటించే సమయం లో ఆమని తో అత్యంత సన్నిహితం గా మెలిగేవారని చెబుతుంటారు. ఆమని కూడా పలు ఇంటర్వ్యూలలో సౌందర్య గురించి చెబుతూ వచ్చారు. సౌందర్య, ఆమని ఇద్దరు సన్నిహితం గా మెలిగేవారని, అన్ని విషయాలను పంచుకునే వారు అని చెబుతుంటారు.

soundarya 2

ఇటీవల, “చావు కబురు చల్లగా” సినిమా లో నటించిన ఆమని, సినిమా ప్రమోషన్స్ లో భాగం గా పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఇందులో ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సౌందర్య కి నేను కాకుండా ఇంకెవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉండి ఉండొచ్చని, నాకు మాత్రం ఇండస్ట్రీ లో సౌందర్యే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. పెళ్లి అయిన తరువాత కూడా సౌందర్య తో అప్పుడప్పుడు మాట్లాడేదానినని, కానీ తను రమ్మని చాలా సార్లు పిలిచినా వెళ్లలేకపోయానని బాధపడ్డారు.

soundarya 3

సౌందర్య చనిపోయారు అంటూ వార్తలు వచ్చినప్పుడు మొదట నమ్మలేదని అన్నారు. ఎదో ఫేక్ న్యూస్ అయి ఉంటుందని అనుకున్నానని, కానీ తాను నిజం గా చనిపోయిందని సరికి స్థాణువైపోయానని అన్నారు. అప్పటికి షూటింగ్ లోనే ఉన్నానని, చేతులు, కాళ్ళలో షివరింగ్ వచ్చేసిందని తెలిపారు. ఆ తరువాత, తన అంత్యక్రియలు చూడ్డానికి వెళ్లలేకపోయానని, నెల తరువాత ఆమె అమ్మను కలవడానికి వెళ్లానని తెలిపారు. ఆమె అమ్మగారు కూడా చాలా అమాయకురాలిని, ఆవిడని ఆ పరిస్థితిలో చూడలేకపోయానన్నారు.

amani soundarya 1

ఆ తరువాత కూడా ఓ సారి అటు వైపు వెళ్ళినపుడు.. సౌందర్య అమ్మగారిని చూడడానికి వారింటికి వెళ్లాలని, వారి ఫోన్ నెంబర్ తన దగ్గర లేకపోవడం తో ఇంటికే వెళ్లానన్నారు. ఇంటిని చూసి ఎంట్రన్స్ లో నే షాక్ అయ్యానన్నారు. అది ఓ బూత్ బంగ్లా లా మారిపోయిందని, అక్కడ ఎవరు లేరని బాధ పడ్డారు.ఆ తరువాత, అక్కడ వారిని అడిగితె, అక్కడ ఎవరు ఉండడం లేదని, షిఫ్ట్ అయిపోయారని, ఎక్కడకు వెళ్లారో తెలియదని చెప్పారు.

watch video:

 


End of Article

You may also like