అమిర్‌ ఖాన్ కుమార్తె రిజిస్టర్ మ్యారేజ్.. జిమ్ డ్రెస్ లో వరుడు..!

అమిర్‌ ఖాన్ కుమార్తె రిజిస్టర్ మ్యారేజ్.. జిమ్ డ్రెస్ లో వరుడు..!

by Mounika Singaluri

Ads

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక రకంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఐరా ఖాన్ డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ జరుగుతుంటుంది.

Video Advertisement

ఐరా ఖాన్, ఫిట్ నెస్ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరే ప్రేమ మరియు డేటింగ్ గురించి వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వరుడు నుపుర్‌ జిమ్ సూట్ లోనే వచ్చి, పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

జనవరి 3, బుధవారం నాడు ఐరా, నుపుర్‌లకు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఈ వేడుకకు హాజరు అయిన వరుడు ఫిట్ నెస్ ట్రైనర్ అయిన నుపుర్ రెగ్యులర్ జిమ్ డ్రెస్ తోనే వచ్చాడు. ఇక ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉదయం జాగింగ్ ఎలా చేస్తుంటాడో అలాగే,  జాగింగ్ చేస్తూ వచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తరువాత జరిగిన రిసెప్షన్‌ వేడుకకు షేర్వాణిలో వచ్చాడు. దీంతో ఈ పెళ్లి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీటిని చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు అయితే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫిట్ నెస్ ట్రైనర్‌ పెళ్లి మాములుగా ఉండదని కామెంట్స్ చేస్తుంటే. ఇంకొందరు  పెళ్లి చేసుకునే వ్యక్తి అంత సింపుల్ గా వచ్చాడు. పెళ్ళికి వచ్చిన వారు బట్టలకు అంత ఖర్చు పెట్టడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నూపుర్ డ్రెస్ కారణంగా ఐరా నుపుర్‌ ల పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


End of Article

You may also like