ఆస్థి మొత్తం తల్లికే చెందాలి…నా భార్యకు అందులో భాగం లేదని ఆ లెటర్ లో రాసి!

ఆస్థి మొత్తం తల్లికే చెందాలి…నా భార్యకు అందులో భాగం లేదని ఆ లెటర్ లో రాసి!

by Megha Varna

ఇటీవల కాలంలో భార్య ,భర్తలు గొడవలు పెట్టుకొని  విడాకుల కోసం కోర్ట్ ని ఆశ్రయించేవాళ్ళు ఎక్కువ అయిపోయారు.కొంతమంది అయితే వివాహ జీవితం లో ఫెయిల్ అయితే ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.ఈ క్రమంలో పెద్దపల్లి ,వెల్గటూరు లో భార్య కాపురానికి రావడం లేదని కలత చెంది ఆత్మహత్యకు పాల్పడడ్డాడు శ్రీధర్ అనే ఓ వ్యక్తి.వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

source: sakshi

వెల్గటూరు కు చెందిన శ్రీధర్ అనే 35 యేళ్ళ వ్యక్తి రామడుగు గ్రామానికి చెందిన జల అనే మహిళను వివాహం చేసుకున్నాడు.వీరికి పెళ్లి అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది.అయితే ఈమధ్య కాలంలో వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు నెలకొన్నాయి.దీనితో కుటుంబ సభ్యులు ,గ్రామా పెద్దల మధ్యలో పలుమార్లు సెటిల్మెంట్స్ కూడా జరిగాయి.ఐన సరే వీరిద్దరి మధ్య గొడవలు ఆగలేదు.దీంతో 10 రోజుల క్రితం జల పుట్టింటికి వెళ్ళిపోయింది.దీంతో మనస్థాపం చెందిన శ్రీధర్ తాగుడుకు బానిస అయ్యాడు.

representative image

అయితే రెండురోజుల క్రితం జల కుటుంబ సభ్యులు శ్రీధర్ ఇంటికి వచ్చి నీకు పిల్లలు పుట్టడంలేదు.కాబట్టి నువ్వు పట్టణానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి అంటూ బెదిరించారు .దీంతో ఈ విషయం పై శ్రీధర్ మరియు అతని తల్లి పోలీసులకు పిర్యాదు చెయ్యడానికి వెళ్లగా సదరు ఎసై సాయంత్రం రావాల్సిందిగా చెప్పడంతో ఇంటికి వచ్చేసారు శ్రీధర్ మరియు అతని తల్లి.జల బంధువుల నుండి ప్రాణ హాని ఉందని శ్రీధర్ భయపడుతూ ఉన్నాడు దీనికి తోడు భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనోవేదంలో ఉండీ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు శ్రీధర్.చనిపోయే ముందు శ్రీధర్ జేబులో ఓ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

representataive image

నా చావుకి నా భార్య జల కారణమని వారిపై పోలీస్ కేసు పెట్టి కఠినంగా శిక్షిస్తేనే నా ఆత్మ శాంతిస్తుందంని నా ఆస్థి మొత్తం నా తల్లికే చెందాలని నా భార్యకు అందులో భాగం లేదని ఆ లెటర్ లో రాసి ఉంది.జల తరుపు బంధువులు ఇక్కడికి వస్తే గాని అంత్యక్రియలు జరపమని శ్రీధర్ తరుపు బంధువులు మొండికేశారు.అయితే సీఐ రామచంద్రరావు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

source: sakshi


You may also like

Leave a Comment