Ads
కరోనా మనుషులనే కాక మూగ జీవులను కూడా వేరు చేస్తుంది.తాజాగా తమిళనాడులోని మదురై ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఇక వివరాలలోకి వెళ్తే
Video Advertisement
మధురై ప్రాంతంలో నివాసముంటున్న ఓ రైతు కరోనా కారణంగా ఆర్థికంగా బాగా నష్టపోయాడు.కుటుంబాన్ని గడపడం కోసం ఏం చేయాలో తెలియక తన వద్ద ఉన్న ఒక ఆవును పక్క గ్రామంలోని మరో రైతుకు అమ్మాడు.అందుకోసం తన వద్ద ఉన్న ఆవును వ్యాన్ లో తీసుకెళ్లడానికి సిద్దమయ్యాడు.కాని తనతో ఇన్నాళ్లు కలిసి ఉన్న ఆవును తీసుకెళ్లడాన్ని తట్టుకోలేకపోయిన ఎద్దు దాదాపు గంట సేపు ఆ వ్యాన్ ను ముందుకు పోనీయకుండా అడ్డుపడింది.
అది చూసి బాధపడడం తప్ప ఏం చేయలేని రైతు చివరికి వ్యాన్ ను కదిలించాడు.ఎద్దు కూడా ఆ వ్యాన్ వెంట పరిగెత్తింది…ఈ ఉదంతాన్ని పక్కన ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.వీడియో చూసిన వారంతా ప్రస్తుత పరిస్థితికి కారణమైన కరోనాను నాలుగు తిట్లు ఎక్కువ తిట్టుకుంటున్నారు.
End of Article