కరోనా నుండి కోలుకునే లోపే మరో వ్యాధి అంట…డిసెంబర్ లో యుద్ధం?

కరోనా నుండి కోలుకునే లోపే మరో వ్యాధి అంట…డిసెంబర్ లో యుద్ధం?

by Mohana Priya

Ads

అభిజ్ఞ ఆనంద్. ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. మే 29 కల్లా కరోనా వైరస్ అంతం అవుతుంది అని చెప్పాడు ఈ అబ్బాయి. చూడడానికి చిన్నవాడు అయినా కూడా ప్రపంచం మొత్తం తెలిసినట్టు మాట్లాడుతాడు. అతని మాటల్లో ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో అతనికే తెలియాలి.

Video Advertisement

అతను చెప్పినట్టు కరోనా వైరస్ అయితే అంతం కాలేదు. కానీ ఈ ఒక్క విషయం అబద్ధం అయింది అని అతను చెప్పే అన్ని విషయాలను కొట్టిపారేయడం కూడా తప్పే. ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం అవుతుందా అని ఇప్పుడు మరొక సందేహం క్రియేట్ చేసి ఆ సందేహానికి సమాధానం కూడా అతనే ఇచ్చాడు. అసలు అతను ఏం చెప్పాడంటే.

ఇలాంటి ఉపద్రవాలు ముందు ముందు ఇంకా వస్తూ ఉంటాయట. యుద్ధం విషయానికొస్తే డిసెంబర్ వరకు ఎటువంటి యుద్ధాలు అవ్వవు. కరోనా వైరస్ నుండి జనాలు కోలుకొనే లోపే మరో కొత్త వ్యాధి సంభవిస్తుందట. అది కూడా వచ్చే నవంబర్ లోనే అట.

సంవత్సరం చివర్లో అంటే డిసెంబర్ లో యుద్ధం జరిగే అవకాశం ఉందట లేకపోతే ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయట. లేకపోతే యుద్ధం ఇంకా ఆర్థిక నష్టం రెండు జరిగినా జరగొచ్చట. ఏంటి? ముందు ముందు ఇంత ఘోరంగా ఉండబోతోందా? వచ్చే సంవత్సరం అయిన బాగుంటుందా? అలాంటి ఆశ ఉంటే మాత్రం ఇతను చెప్పింది వింటే అది కూడా ఆవిరైపోతుంది.

వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉపద్రవాలు ఇంకా ముంచుకొచ్చి మరణాలు ఇంకా ఎక్కువ అవుతాయట.అభిజ్ఞ చెప్పిన విషయాన్ని సాధారణ భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనం చూసింది శాంపిల్ మాత్రమే. భవిష్యత్తులో మనం చూడాల్సినవి, ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి.

అతను చెప్పిన మాటలు నిజం అవుతాయా అవ్వవా అన్న విషయాన్ని పక్కన పెడితే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఇప్పటినుండి అయినా మనం మాత్రం ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యూన్ సిస్టం డెవలప్ చేసుకోవాలి అంతేకాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. భవిష్యత్తులో ఏమౌతుంది అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.


End of Article

You may also like