Ads
తేజ అంటే బలమైన కంటెంట్ ఉన్న సినిమాలకి పెట్టింది పేరు. తేజ సినిమాలు అన్నీ కూడా సహజంగా ఉంటాయి. తేజ తన సినిమాలతో ఎంతో మంది నటీనటులని పరిచయం చేశారు. ఇప్పుడు సురేష్ బాబు గారి రెండవ కొడుకు, రానా దగ్గుబాటి తమ్ముడు అయిన అభిరామ్ దగ్గుబాటిని అహింస సినిమా ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : అహింస
- నటీనటులు : అభిరామ్ దగ్గుబాటి, గీతిక, సదా.
- నిర్మాత : పి. కిరణ్
- దర్శకత్వం : తేజ
- సంగీతం : ఆర్పీ పట్నాయక్
- విడుదల తేదీ : జూన్ 2, 2023
స్టోరీ :
రఘు (అభిరామ్ దగ్గుబాటి) ఊర్లో ఉంటూ పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. రఘు తన మరదలిని ప్రేమిస్తాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల రఘుకి కొంత మంది వ్యక్తులతో గొడవ అయ్యి పొలం చిక్కుల్లో పడుతుంది. అలాగే కొంత మంది రఘు మరదలిని కిడ్నాప్ చేస్తారు. అసలు రఘుని ఇబ్బంది పెట్టిన వారు ఎవరు? తన పొలం తిరిగి తెచ్చుకున్నాడా? రఘు మరదలికి ఏమయ్యింది? రఘు ఈ సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేస్తూ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ. తేజ తన సినిమాలతో చాలా మంది నటులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారిలో ఇప్పుడు చాలా మంది స్టార్లుగా గుర్తింపు పొందారు. ఇదే విధంగా తేజ అభిరామ్ దగ్గుబాటిని అహింస సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. కథ విషయానికి వస్తే సినిమా అంతా ఒక వ్యక్తి, అతను ఎదుర్కొన్న సమస్యల చుట్టూ తిరుగుతుంది.
సినిమా పాయింట్ వినడానికి సింపుల్ గా అనిపించినా కూడా, కథ ముందుకి వెళ్లే కొద్దీ సస్పెన్స్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు, “ఎన్ని రోజులు అయ్యింది ఇలాంటి సినిమా చూసి?” అని అనిపిస్తుంది. అది కూడా ఇంత ఇంటెన్స్ గా ఉన్న సినిమా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది ఏమో అనిపిస్తుంది. తేజ మార్క్ ప్రతి సీన్ లో కనిపిస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా చేశారు. హీరో అభిరామ్ మొదటి సినిమా అయినా కూడా అమాయకంగా ఉండే పాత్రలో చాలా బాగా నటించారు. హీరోయిన్ తన పాత్ర పరిధికి తగ్గట్టుగా నటించారు. సినిమాలో సదా కూడా ఒక లాయర్ పాత్రలో నటించారు. నెగిటివ్ పాత్రలో కొంత మంది నటులు నటించారు.
వారిలో చాలా మంది కొత్తగా అనిపించారు. అయినా కూడా వారి నటన మాత్రం చాలా బాగుంది. సినిమాలో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా అదే పాయింట్ మీద నడుస్తుంది. అయితే ఎక్కువగా ఫైటింగ్స్ ఉన్న సినిమాలని ఇష్టపడని వారు ఈ సినిమాని ఇష్టపడే అవకాశాలు తక్కువ. అలాగే కొన్ని చోట్ల సీన్స్ కూడా సాగదీసినట్టుగా అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- నటీనటుల పర్ఫార్మెన్స్
మైనస్ పాయింట్స్:
- ఎక్కువగా ఉండే యాక్షన్ సీన్స్
- సాగదీసినట్టుగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా చూద్దాం అనుకునే వారికి, తేజ మార్క్ ఉన్న సినిమా ఇష్టపడే వారికి అహింస సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
https://www.youtube.com/watch?v=LIFagr3pJsE&pp=ygUOYWhpbXNhIHRyYWlsZXI%3D
End of Article