జబర్దస్త్ నరేష్ అసలు వయసు ఎంతో తెలుసా..? ఈ వయసులోనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడా..?

జబర్దస్త్ నరేష్ అసలు వయసు ఎంతో తెలుసా..? ఈ వయసులోనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడా..?

by Megha Varna

Ads

జబర్దస్త్ షో లో నరేష్ పంచులకు కామెడీ టైమింగ్ కి క్రేజ్ ఎక్కువన్న సంగతి మనకు తెలుసు. తన కామెడీతో నిజంగా జనాల్ని కడుపుబ్బ నవ్విస్తాడు నరేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. మరి వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

బాల్యం నుండి నరేష్ కి ఎదుగుదల లోపం ఉంది. దీని కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయితే ఆ లోపమే ఇప్పుడు తనకి దేవుడిచ్చిన వరంగా మారింది.

చూడడానికి పదేళ్ల పిల్లలకి కనిపిస్తాడు నరేష్. కానీ అతని వయసు 20 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరు. నరేష్ 2000 వ సంవత్సరంలో పుట్టాడు. తనకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఇష్టం అయితే ఆ ఇష్టంతోనే డాన్స్ నేర్చుకోవడం.. ఢీ షోకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి నరేష్ కి మంచి అవకాశాలు రావడం జరిగింది.

మొదట సుధాకర్ టీంలో కామెడీ చేసిన నరేష్ ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీం లోకి వెళ్ళాడు అక్కడి నుంచి నరేష్ దశ తిరిగిపోయింది. తన కామెడీతో పంచులతో పిచ్చి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. మామూలుగా స్కిట్ చేయాలంటే ఆర్టిస్టులందరూ స్కిట్ ని ప్రాక్టీస్ చేయాలి. కానీ నరేష్ అసలు ప్రాక్టీస్ చేయదు. స్క్రిప్ట్ ఏమిటి, స్కిట్ స్టార్టింగ్ ఏమిటి, ఎండింగ్ ఏమిటి అనేది అతనికి తెలిస్తే సరిపోతుంది.

నరేష్ వల్ల మంచి పేరు తన టైంకి వచ్చిందని బుల్లెట్ భాస్కర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. జబర్దస్త్ షోలోకి వచ్చాక నరేష్ తన సొంత ఊరిలో ఇల్లు కట్టుకున్నాడు. ఆతర్వాత సిటీలో ఫ్లాట్ కూడా కొన్నాడు. ఇది ఇలా ఉంటే తను ఎదుగుదల లోపం నుండి బయటపడడం కష్టం. నయం అయ్యే సూచనలు కూడా లేవని డాక్టర్లు చెప్పేశారు. నిజంగా ఇది బాధాకరం. అందర్నీ ఇంతలా నవ్వించే నరేష్ జీవితంలో ఇంత విషాదం దాగి ఉంది.


End of Article

You may also like