Ads
కూకట్ పల్లి లో ఇటీవల ఒక కారు బీభత్సం సృష్టించింది. కే పీ హెచ్ బి కాలనీలో రెండో రోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో అశోక్ కాలే కుటుంబం నివాసం ఉంటారు. జీడిమెట్ల లో ఏపీఐఐసీ కాలనీలో సంతోషి మా పేరుతో సూపర్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు అశోక్. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మెట్రో స్టేషన్ దాటంగానే పిల్లర్ నెంబర్ 757 దగ్గర వెనక నుండి వేగంగా వచ్చిన ఒక కారు అశోక్ బైక్ ని ఢీ కొట్టింది. అశోక్ అక్కడే మరణించారు.
Video Advertisement
ఆ కార్ మరొక ద్విచక్ర వాహనాన్ని, పక్కనే నడిచి వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. దాంతో వారిద్దరూ గాయపడ్డారు. అంతేకాకుండా ఆ కార్ ముందు వెళ్తున్న ఒక ఆటోను ఢీ కొట్టింది, ఆటో యజమాని ఉదయ్ కుమార్ కాళ్ళకు గాయాలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి కారును కూడా ఢీకొట్టడంతో శ్రీనివాస్ రెడ్డి కి గాయాలయ్యాయి.
ఒక ఆర్టీసీ బస్సును ఢీకొని కారు ఆగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 757 దగ్గర మొదలైన కార్ పిల్లర్ నెంబర్ 763 వద్ద ఆగింది. ఈ ప్రమాదం జరగడానికి కారణమైన ఆ కారులో డ్రైవర్ శ్రీనివాస్, యజమాని కొండయ్య ఉన్నారు. డ్రైవర్ శ్రీనివాస్ కారు ని వేగంగా నడిపి ఈ ప్రమాదం జరగడానికి కారణం అయ్యాడు.
watch video:
End of Article