Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.
Video Advertisement
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది.
ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డేతో పాటు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నటీనటులు కనిపించారు. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా కాజల్ నటిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక కథ వైరల్ అవుతోంది. అదేంటంటే సినిమా మొదలయ్యేది ధర్మస్థలిలో. ఇక్కడ సిద్ధ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడు. అక్కడ సోనుసూద్ ఊరిలో సమస్యలు సృష్టిస్తాడు.
ఈ క్రమంలో సిద్ధకి, సోనూసూద్ కి మధ్య గొడవలు జరుగుతాయి. సిద్ధ కొన్ని కారణాలవల్ల ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అలా ఊరు వదిలి వెళ్ళిన సిద్ధ చిరంజీవి నక్సలైట్ గ్రూప్ లో చేరతాడు. అక్కడ చిరంజీవికి తన ఊరి గురించి అక్కడి పరిస్థితుల గురించి చెప్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సిద్ధ ప్రాణాలను కోల్పోతాడు. అప్పుడు చిరంజీవి వెళ్ళి సిద్ధ ఊరిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు. సిద్ధ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న కాజల్ తో చిరంజీవి పాత్ర ప్రేమలో పడినట్లు చూపిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఇదే. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాలి.
End of Article