గొప్ప మనసున్న నటుడు నందు.. ఏకంగా 800 మందికి వండి వడ్డించిన ఘనుడు!

గొప్ప మనసున్న నటుడు నందు.. ఏకంగా 800 మందికి వండి వడ్డించిన ఘనుడు!

by Mounika Singaluri

Ads

ప్రముఖ నటుడు, స్టార్ యాంకర్, ఒకవైపు సినిమాలు, ఒకవైపు వెబ్ సిరీస్ లు, మరోవైపు ఐపీఎల్ లాంటి ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్లలో కూడా స్పోర్ట్స్ యాంకర్ గా చేస్తూ బిజీ లైఫ్ నీ లీడ్ చేస్తున్నాడు నందు. సుమారుగా 25 కు పైగా సినిమాలలో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న నటుడు నందు. ఇటీవల తాను నటించిన మ్యాన్షన్ 23, వధువు వంటి వెబ్ సిరీస్ లకు ఓటీటీలలో మంచి పేరు లభించింది.

Video Advertisement

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే నందు ప్రముఖ సింగర్ గీతామాధురిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరి పెళ్లి 2014లో జరిగింది. వీళ్ళకి 2019లో దాక్షాయిని ప్రకృతి అనే పాప పుట్టింది. మరొకసారి ఇప్పుడు మళ్లీ తల్లిదండ్రులు అయ్యారు నందు,గీతామాధురిలు. గీతా మాధురి సీమంతం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి

అయితే తాజాగా గీతామాధురి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మరి ఈ విశేషమో లేక మరి ఏదైనా సందర్భమో తెలియదు కానీ ఒక మంచి పని చేసి అందరి మనసులు గెలుచుకున్నారు నందు. 800 మందికి స్వయంగా వండి వడ్డించి తన గొప్ప మనసు చాటుకున్నాడు నందు శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు ఆ తర్వాత ఎనిమిది వందల మందికి ఆహారాన్ని అందించారు, ఆయనే స్వయంగా వడ్డించారు.

అనంతరం ఆ పాత్రలను సైతం శుభ్రం చేశారు యాక్టర్ అనే ట్యాగ్ ని పక్కనపెట్టి సామాన్యుడిగా ప్రతి పనిలోని సాయం చెయ్యడం చూసిన నెటిజెన్స్ నందు సింప్లిసిటీకి అతని గొప్ప మనసుకి హాట్సాఫ్ చెప్తున్నారు. అన్నదానం చేసి గొప్ప పని చేశావు అంటూ నందుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే నందు కరోనా సమయంలో కూడా ఎంతో మందికి అన్నదానం చేసి తన మంచి మనసుని చాటుకున్నాడు.


End of Article

You may also like