Ads
సాధారణంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉండే హీరోయిన్లు అందరూ కూడా ఇతర భాషలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. గత కొంత కాలం నుండి తెలుగు మాట్లాడే హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో వస్తున్నారు. అయినా కూడా ఎలాగైనా తెలుగు నటులకి తెలుగులో కంటే కూడా ఇతర భాషల్లో ఎక్కువ గుర్తింపు దొరుకుతుంది.
Video Advertisement
అలా ఇటీవల మలయాళం సినిమా ఇండస్ట్రీ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంయుక్త, ఆ తర్వాత బింబిసార సినిమాలో నటించారు. అంతే కాకుండా ఇటీవల విడుదల అయిన సార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు.
సంయుక్త నటించిన అన్ని తెలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో సంయుక్త ని లక్కీ అనడం మొదలు పెట్టారు. అయితే ఇటీవల జరిగిన సార్ ఆడియో రిలీజ్ లో అతిథిగా హాజరు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, సంయుక్త గురించి మాట్లాడటం కొంచెం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ కూడా రావడం మొదలు అయ్యాయి. అయితే ఈ విషయంపై ప్రముఖ నటి రేఖ భోజ్ కూడా కామెంట్ చేశారు.
రేఖ అంతకుముందు తెలుగు హీరోయిన్లకి మద్దతుగా చేసిన పోస్ట్ అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఎంతో మంది రేఖ కామెంట్స్ కి సపోర్ట్ గా మాట్లాడారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక విషయంపై రేఖ భోజ్ ఒక పోస్ట్ చేశారు. అందులో, ” ఫస్ట్ టైం క్రాస్ ఫిట్. లిటరల్లీ చర్చి బతికా. చాలా కష్టపడుతున్నా గురూజీ! ఆ మల్లు మీనన్‌నే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దయ చూడండి” అని రాశారు. ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికి చాలా కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి.
దీనికి ఒక వ్యక్తి “మల్లు మీనన్ ఎవరు?” అని కామెంట్ చేశారు. అందుకు రేఖ, “ఇటీవలి కాలంలో గురూజీ చల్లని చూపు పడిన మలయాళీ నటి మీనన్” అని అన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article