హాస్పిటల్ ఖర్చులకి కూడా డబ్బులు లేని ధీన స్థితి లో ప్రముఖ నటుడు..!

హాస్పిటల్ ఖర్చులకి కూడా డబ్బులు లేని ధీన స్థితి లో ప్రముఖ నటుడు..!

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎంతోమంది జీవితాలలో చీకట్లు నింపింది.అన్ని రవాణా మార్గాలు నిలివేయడంతో ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయారు.ఇందులో వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు.కాలినడకన,సైకిల్ మీద,రిక్ష మీద వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి మార్గం మధ్యలో చనిపోయిన సంఘటనలు చాలానే చూసాం.ఆకలి తట్టుకోలేక కుక్క మాంసాన్ని తిన్న ఘటనలు చూసాం.కడసారి చూపు దక్కించుకొని ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి ఈ లాక్ డౌన్ లో.

Video Advertisement

అయితే పనిచేసుకోవడానికి లేక డబ్బులు లేక పేద ,మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే కొంతమంది ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు అందించి సహాయం చేస్తున్నారు.కానీ ఇలా సహాయం కూడా అందని కుటుంబాలు ఎన్నో ఉన్నాయ్.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓ బాలీవుడ్ నటుడు.వివరాల్లోకి వెళ్తే..


పంజాబ్ కి చెందిన నటుడు సతీష్ కౌల్ వందల బాలీవుడ్ మరియు పంజాబ్ సినిమాల్లో నటించారు.చాలా టీవీ సీరియల్స్ లో కూడా నటించారు సతీష్ కౌల్.అయితే మహాభారతంలో ఇంద్రుని పాత్ర ద్వారా చాలామందికి గుర్తిండిపోతారు సతీష్ కౌల్.మరో సీరియల్ లో ఆంజనేయ స్వామి పాత్ర కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు సతీష్ కౌల్.అయితే సతీష్ కౌల్ పంజాబ్ లోని లూథియానా లో అద్దెకు ఉంటున్నారు.కాగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆసుపత్రి లో ఉన్నారు సతీష్ కౌల్.కాగా లాక్ డౌన్ కారణంగా ఎప్పటి నుండో షూటింగ్స్ లేకపోవడంతో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు సతీష్ కౌల్.కనీసం నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని స్థితిలో అన్నారాయన.అయితే ఈ విషయం తెలుసుకున్న కపిల్ శర్మ ఆయనకు ఆర్థిక సహాయం చేసి నిత్యావసర సరుకులు అందించారు..


End of Article

You may also like