వైరల్ అవుతున్న “నువ్వే కావాలి” 20 ఏళ్ల సెలబ్రేషన్ ఫోటోలు…తరుణ్ ఏంటి ఇలా మారిపోయాడు.?

వైరల్ అవుతున్న “నువ్వే కావాలి” 20 ఏళ్ల సెలబ్రేషన్ ఫోటోలు…తరుణ్ ఏంటి ఇలా మారిపోయాడు.?

by Mohana Priya

Ads

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలు పెట్టి, తర్వాత లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నారు తరుణ్. 1990 లో వచ్చిన మనసు మమత సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు తరుణ్. ఈ సినిమాకి బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. తర్వాత అంజలి, సూర్య ఐపిఎస్, ఆదిత్య 369, వజ్రం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. నువ్వేకావాలి సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

 

ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు తరుణ్ కి కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, అదృష్టం, నువ్వే నువ్వే, చిరుజల్లు, నీ మనసు నాకు తెలుసు, ఒక ఊరిలో, సోగ్గాడు, శశిరేఖ పరిణయం, భలే దొంగలు ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు తరుణ్.

 

2018 లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ సినిమా తర్వాత తరుణ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే ఇటీవల నువ్వే కావాలి సినిమా విడుదలయ్యి 20 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా నువ్వే కావాలి సినిమా 20వ ఆనివర్సరీ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలలో తరుణ్ కొంచెం లావుగా కనిపిస్తున్నారు. అంతకు ముందు తరుణ్ కి, ఇప్పుడు చూస్తున్న తరుణ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. తరుణ్ మళ్లీ తొందరలోనే ఒక మంచి పాత్రతో కం బ్యాక్ ఇవ్వాలి అని ఆశిద్దాం.


End of Article

You may also like