Home Filmy Adda ఈ 10 సినిమాల్లో “వివేక్” నటించారని చాలా మందికి తెలియదు అనుకుంటా.?

ఈ 10 సినిమాల్లో “వివేక్” నటించారని చాలా మందికి తెలియదు అనుకుంటా.?

by Mohana Priya

ఎన్నో తమిళ సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించి చాలా పేరు తెచ్చుకున్నారు వివేక్ గారు. వివేక్ గారు కొన్ని రోజుల క్రితం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వివేక్ గారు ఎక్కువగా నటించింది తమిళ సినిమాల్లో అయినా కూడా అవి తెలుగులో డబ్ అవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులకి కూడా వివేక్ గారు సుపరిచితులే. వివేక్ గారు నటించిన సినిమాల్లో తెలుగులో డబ్ అయిన సినిమాల్లో ప్రేక్షకులకి దగ్గర అయిన పాత్రలు సినిమాలు ఇవే.

#1 బాయ్స్

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వివేక్ గారు ఒక ముఖ్య పాత్రలో నటించారు.

actor vivek best telugu roles

#2 విజిల్

ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కనిపిస్తారు వివేక్ గారు.

actor vivek best telugu roles

#3 అపరిచితుడు

అపరిచితుడు సినిమాలో విక్రమ్ ఫ్రెండ్ గా నటించిన వివేక్ గారి పాత్ర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

actor vivek best telugu roles

#4 యముడు

ఈ సినిమాలో పోలీస్ గా నటించారు వివేక్ గారు.

actor vivek best telugu roles

#5 శివాజీ

శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమాలో కూడా వివేక్ గారు ఒక ముఖ్య పాత్రను పోషించారు.

actor vivek best telugu roles

#6 రఘువరన్ బీటెక్

రఘువరన్ బీటెక్ సినిమాలో కామెడీ ట్రాక్ మొత్తాన్ని హ్యాండిల్ చేశారు వివేక్ గారు.

actor vivek best telugu roles

#7 చెలి

గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా వివేక్ ఒక ముఖ్య పాత్ర పోషించారు.

actor vivek best telugu roles

#8 సఖి

మణిరత్నం గారి దర్శకత్వంలో మాధవన్, శాలిని హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాలో కూడా వివేక్ గారు ఒక ముఖ్య పాత్రను పోషించారు.

actor vivek best telugu roles

#9 ఎంత వాడు గాని

గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వివేక్ గారు పోలీస్ గా నటించారు.

actor vivek best telugu roles

#10 రన్

మాధవన్ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో వివేక్ గారి కామెడీ ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది.

actor vivek best telugu roles

ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాల్లో వివేక్ గారు ఎన్నో మంచి పాత్రలు పోషించారు. అంతే కాకుండా వ్యక్తిగతంగా కూడా పర్యావరణం బాగుచేయడానికి తన వంతు సహాయం చేసి గొప్ప నటుడిగానే కాకుండా గొప్ప వ్యక్తిగా కూడా గుర్తింపు సంపాదించారు వివేక్ గారు. వివేక్ గారు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ గారు హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటించారు.

You may also like