Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. పుష్ప సినిమాకి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తోంది.
ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. సునీల్, అనసూయ, అజయ్, దివ్య శ్రీపాద, అజయ్ ఘోష్ ఇంకా చాలా మంది నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. వీరందరితో పాటు సినిమాలో మరొక ముఖ్య పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్. జగదీష్ పుష్పలో పుష్ప రాజ్ ఫ్రెండ్ అయిన కేశవ అనే పాత్రలో నటించారు. జగదీష్ అంతకుముందు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించారు.
అందులో ఒకటి గాడ్స్ ఆఫ్ ధర్మపురి. ఇందులో చలపతి అనే పాత్రలో నటించారు జగదీష్. ఈ వెబ్ సిరీస్ జగదీష్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు పుష్ప సినిమాతో ఇంకా పాపులర్ అయ్యారు. పుష్ప రాజ్ జర్నీ మొత్తంలో కేశవ ఉంటాడు. రెండో భాగంలో కూడా ఈ పాత్ర ఉండే అవకాశం ఉంది. ఇంక సినిమా విషయానికి వస్తే, పుష్ప రెండవ భాగానికి సంబంధించిన షూట్ కొంతవరకు అయ్యింది అని సమాచారం. ఫిబ్రవరి 2022 లో షూటింగ్ మళ్ళీ మొదలు పెడతారు.
End of Article