“త్రిష” కి తండ్రిగా, మామగా, ప్రేమించిన వ్యక్తిగా నటించిన… ఒకే ఒక్క నటుడు ఎవరో తెలుసా..?

“త్రిష” కి తండ్రిగా, మామగా, ప్రేమించిన వ్యక్తిగా నటించిన… ఒకే ఒక్క నటుడు ఎవరో తెలుసా..?

by kavitha

తమిళ్, తెలుగు సినిమాల్లో ఎన్నో సంవత్సరాల నుండి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది త్రిష. త్రిష సినిమాల్లో ఎన్నో పాత్రలలో నటించింది. కానీ ఒకే యాక్టర్ త్రిషకీ నాన్నగా, మామగా, లవర్ గా, అన్నగా నటించాడు. ఇంతకి ఆ నటుడు ఎవరో తెలుసా ప్రకాష్ రాజ్.

Video Advertisement

ప్రకాష్ రాజ్ సౌత్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు. రెండు వందల చిత్రాలకు పైగా నటించారు. 5 భారతీయ భాషల మీద పట్టున్న యాక్టర్. ఇప్పటివరకు నాలుగు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నారు. తెలుగు,మళయాళం, కన్నడ,తమిళ్, హింది భాషా చిత్రాలలో నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిన తీరు ఆకట్టుకుంటుంది. ఎక్కువగా తండ్రి పాత్రల్లో నటించారు.ఇక నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు.ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్‌ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్‌బ్యాక్‌ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్‌ చేసింది.trisha-prakash-raj-telugu-adda2ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.తమిళంలో విజయ్‌ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్‌ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్‌. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్‌రాజ్‌, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’సూపర్ హిట్ అయ్యింది.


You may also like

Leave a Comment