Ads
కె విశ్వనాధ్ దర్శకత్వంలో స్వర్ణకమలం సినిమా 1988లో విడుదల అయింది. ఈ సినిమాలో వెంకటేష్ భానుప్రియ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా ని కె. ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై సి.హెచ్.వి అప్పారావు నిర్మించారు.
Video Advertisement
వెంకటేష్, భాను ప్రియా పాత్రలు అయితే అమోఘమే. ఈ సినిమా కి గాను ఉత్తమ నటిగా భానుప్రియ కి ఉత్తమ నటుడిగా వెంకటేష్ కి ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారాలు అందుకున్నారు.
అలానే ఈ సినిమా కి ఇంకా ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా లోని పాటలని సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసారు. ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా లో భాను ప్రియ తండ్రి గా నటించింది ఎవరో మీకు తెలుసా..? చాలా మందికి ఆయన గురించి తెలియదు. తెలుసుకోవాలని వెతుకుతున్నారు. భానుప్రియ తండ్రిగా నటించింది ఎవరు అంటే ఎవరికి నచ్చిన సమాధానాలు వాళ్ళు చెబుతున్నారు.
కోరా ప్రకారం చూస్తే.. ఘంటా కనక రావు గారు భానుప్రియ తండ్రిగా నటించారు. వీరి స్వగ్రామం ఏలూరు. ఈయన స్వతహాగా కూడా నాట్యచారులే. శేషేంద్ర శర్మ పాత్ర చేసారు ఈయన. శేషేంద్ర శర్మ గారి కూతురుగా భానుప్రియ నటించారు. భానుప్రియ కి నాట్యం నేర్పాలని ఆయన అనుకుంటారు. ఈమె మాత్రం కళలు కడుపు నింపవని అంటుంది. విలాసవంతమైన జీవనాన్ని ఆమె గడపాలని అనుకుంటూ ఉంటుంది.
ఇవన్నీ కూడా ఆమె కేవలం తన అక్కతో మాత్రమే చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కకి వచ్చిన చంద్రశేఖర్ అనే చిత్రకారుడు ఇవన్నీ గమనిస్తాడు. ఆమె చేత ఎలా అయినా కూడా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తాడు. ఆమె నాట్యం చేస్తూ మధ్యలో వదిలేసి వచ్చేస్తే తన తండ్రి నాట్యం చేస్తారు కానీ దురదృష్టశాత్తు అయిన నాట్యం చేస్తూ చనిపోతాడు. ఇలా మంచి నటన తో నాట్యం తో భాను ప్రియ తండ్రిగా ఘంటా కనక రావు గారు మెప్పించారు.
End of Article