“భరత్ అనే నేను” సినిమాలో “శుభోదయం సుబ్బారావు” గా నటించిన నటుడు ఎవరో తెలుసా..?

“భరత్ అనే నేను” సినిమాలో “శుభోదయం సుబ్బారావు” గా నటించిన నటుడు ఎవరో తెలుసా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో నటించిన రెండవ చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి భరత్ గా విశ్వరూపం చూపించాడు. టేకింగ్ తో కొరటాల శివ మెస్మరైజ్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.

Video Advertisement

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో శుభోదయం సుబ్బారావుగా జర్నలిస్ట్ పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ నటుడు ఎవరో? ఇప్పుడు చూద్దాం.. Subhodayam-Subbarao-telugu addaమహేష్ బాబు, కియారా అద్వానీ జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని అటు మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమా అని చెప్పవచ్చు. సీఎంగా మహేష్ బాబు అద్భుతంగా నటించారు. సీఎం ను ప్రేమించిన అమ్మాయిగా కియారా అద్వానీ, తండ్రిగా శరత్ కుమార్, విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ ఇలా మూవీలో దాదాపు అన్ని పాత్రలలో నటించిన వారికి పేరు వచ్చింది. సీఎంను ప్రశ్నించే జర్నలిస్ట్ శుభోదయం సుబ్బారావు పాత్రలో నటించిన నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అతన్ని అందరు శుభోదయం సుబ్బారావుగానే గుర్తిస్తున్నారు. అంతకు ముందు పలు సినిమాలలో నటించినా, రాని గుర్తింపు ఈ మూవీతో వచ్చింది. ఈ పాత్రలో నటించిన నటుడి పేరు రాజశేఖర్ అనింగి. తెలుగు సినిమాలలో విభిన్న పాత్రలు పోషించారు. రాజశేఖర్ 2014లో వచ్చిన షురుయాత్ కా ఇంటర్వెల్‌ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.ఆ తరువాత తెలుగులో గోవిందుడు అందరి వాడేలే, బాహుబలి: ది బిగినింగ్, స్పైడర్, భరత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీచర్ ఫిల్మ్స్, టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లు మరియు వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇండస్ట్రీలోకి రాకముందు రాజశేఖర్ IT, బ్యాంకింగ్ మరియు ఆరోగ్య రంగంలో పనిచేశాడు.

Also Read: “బ్రో” మూవీలో “సాయి ధరమ్ తేజ్ రెండవ చెల్లెలు” గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?


End of Article

You may also like