Home Filmy Adda సైంధవ్ సినిమాలో వెంకటేష్ కూతురిగా నటించిన ఈ పాప ఎవరో తెలుసా..?

సైంధవ్ సినిమాలో వెంకటేష్ కూతురిగా నటించిన ఈ పాప ఎవరో తెలుసా..?

by Sainath Gopi

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా మంచి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తరికెక్కించగా సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

ఒక వ్యాధితో బాధపడుతున్న తన కూతురికి 17 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ చేయించాల్సి వస్తే ఆ తండ్రి పడి ఇబ్బందులు అతనికి ఏదైనా పరిస్థితులు కథాంశంతో ఈ సినిమాని తరికెక్కించారు. తండ్రి పాత్రలో వెంకటేష్ నటించారు.

actor who acted as venkatesh daughter in saindhav

అయితే ఆయన కూతురుగా నటించిన అమ్మాయి అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. తన నటనతో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అలరించింది. ఇప్పుడు అందరూ కూడా ఆ అమ్మాయి ఎవరు అంటూ వెతకడం మొదలుపెట్టారు.

saindhav movie review

ఈ అమ్మాయి పేరు సారా పాలేకర్…ఈ అమ్మాయి ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాకుండా సింగర్, డాన్సర్,మోడల్, డిజిటల్ క్రియేటర్, బ్లాగర్ ఇలా అన్ని టాలెంట్లు ఈ అమ్మాయిలు ఉన్నాయి. సైంధవ్ సినిమాలో ఈమె నటన చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే యాక్షన్ సినిమా కాబట్టి పండగకి విడుదల అయినప్పుడు అంత మంచి రెస్పాన్స్ రాలేదు.

saindhav movie review

ఎందుకంటే పండగకి అందరూ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. అంతే కాకుండా ఈ సినిమా చూస్తున్నంత సేపు విక్రమ్ సినిమాకి కాపీ లాగా కొన్నిచోట్ల అనిపిస్తుంది. సినిమా కథ కూడా కొన్నిచోట్ల డల్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో రాసుకున్న సీన్ బాగుంది. అంతే కాకుండా సినిమాకి రెండవ భాగం కూడా ఉంటుంది అన్నట్టు చూపించారు. కానీ ఇన్ని పెట్టినా కూడా సినిమా మొదటి నుండి ఆసక్తికరంగా లేకపోవడంతో అంత మంచి రెస్పాన్స్ ఈ సినిమాకి దక్కలేదు.

saindhav movie review

నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నా కూడా సంగీతం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనే కామెంట్స్ అయితే వచ్చాయి. సినిమా కోసం వెంకటేష్ చాలా కష్టపడ్డారు. వెంకటేష్ నటనని అందరూ మెచ్చుకున్నారు. అంటే కాకుండా మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లు కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. అయినా కూడా టేకింగ్ విషయంలో పొరపాట్లు జరగడంతో ఆశించిన ఫలితం రాలేదు. మరి సినిమా బృందం ఈ పొరపాట్లని దృష్టిలో పెట్టుకొని రెండవ భాగం రూపొందిస్తారేమో.

You may also like