ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

actor who played the role of anasuya brother in pushpa

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వచ్చింది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగిడారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది.

actor who played the role of anasuya brother in pushpa

వారిలో దాక్షాయిని పాత్ర పోషించిన అనసూయ తమ్ముడిగా నటించిన అతను కూడా ఒకరు. దాక్షాయిని తమ్ముడు మొగిలీస్ పాత్రలో నటించిన అతని పేరు రాజ్ తిరందసు. రాజ్ అంతకుముందు కొత్త పోరడు అనే ఒక సిరీస్‌లో కూడా నటించారు. రాజ్ పుష్ప సినిమా ద్వారా ఇంకా పాపులర్ అయ్యారు. ఇందులో సునీల్ కి సంబంధించిన ప్రతి సీన్ లో రాజ్ కనిపిస్తారు. ఇవి మాత్రమే కాకుండా, నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన 18 పేజెస్ సినిమాలో కూడా రాజ్ నటించారు.