“సలార్” టీజర్ లో హీరో గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“సలార్” టీజర్ లో హీరో గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

యంగ్ రెబల్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘సలార్’ టీజర్ రిలీజ్ అయ్యింది. యూట్యూబ్ lలో ‘సలార్’ టీజర్ లో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ మొత్తంలో ప్రభాస్ ని 10 సెకన్ల కన్నా ఎక్కువ చూపించలేదు. ఈ విషయం ప్రభాస్ అభిమానులని నిరాశపరిచింది.

Video Advertisement

అయితే ఈ టీజర్‌లో హీరో ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇచ్చిన పెద్దాయన మాత్రం చాలా హైలెట్ అయ్యాడు. అయితే ఆ నటుడు ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలలో నటించాడు. ప్రస్తుతం ఈ టీజర్ లో హైలెట్ అవడంతో ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తున్నారు. మరి ఆ నటుడు ఎవరో? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
actor-tinnu-anandప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్స్ గా మలయాళ స్టార్  పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని దర్శకుడు టీజర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో ప్రభాస్ పూర్తి లుక్ ను చూపించలేదు. కానీ ఈ టీజర్ లో ప్రభాస్ గురించి ఎలివేషన్స్ ఇచ్చిన యాక్టర్ హైలెట్ గా నిలిచాడు. అతను ఎవరో కాదు యాక్టర్ టీనూ ఆనంద్. అతనికి ప్రభాస్ తో ఇది రెండవ మూవీ. ప్రభాస్ ‘సాహో’ మూవీలో ఇతడు నటించాడు. అతను పలు తెలుగు సినిమాలలో నటించాడు. అయితే టీనూ ఆనంద్  తెలుగులో నటించిన మొదటి సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’.  ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన  ‘అంజి’ సినిమా లో విలన్ గా నటించాడు. అతను భాటియా అనే క్యారెక్టర్ లో సరికొత్త విలనిజం పండించాడు.అంతేకాకుండా గతేడాది రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించిన ‘సీతారామం’ మూవీలో కూడా నటించాడు. మూవీ మొదట్లో వచ్చే ఆనంద్ మెహతా అనే క్యారెక్టర్ లో కనిపించాడు. ఆయన కుటుంబంలోని వారంతా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టీనూ ఆనంద్ మేనల్లుడు అయిన సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టీనూ ఆనంద్ లో యాక్టర్ మాత్రమే కాదు. రైటర్, దర్శకుడు, నిర్మాతగా పని చేశాడు.

Also Read: భారతీయ సినీ ఇండస్ట్రీ గురించి “ప్రియాంక చోప్రా” కామెంట్స్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like