ఈ ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

ఈ ఫోటోలో మహేష్ బాబుతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ప్రిపరేషన్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా జరిగింది. హైదరాబాద్ లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళకూడదు అని రాజమౌళి సినిమా బృందానికి ఆదేశాలు ఇచ్చారు. దాంతో సినిమా గురించి బయట ఎక్కడా మాట్లాడకపోవడమే కాకుండా, అసలు ఏం జరుగుతోంది అనే విషయం కూడా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందరూ, అసలు సినిమా మొదలుపెట్టలేదు, సినిమా ప్రిపరేషన్ కూడా జరగట్లేదు అని అనుకుంటున్నారు.

Video Advertisement

actor with mahesh babu in this picture

కానీ ఈ విషయాలు బయట పెట్టకుండా సినిమా బృందం సినిమా గురించి పనిచేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు మొన్నటి వరకు బయట కనిపించలేదు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు మరొక అమ్మాయితో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ ఫోటోలో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే, మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరు అంటూ అందరూ వెతకడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు నీరూ సెహగల్.

actor with mahesh babu in this pictureవీళ్లిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారా అనే అనుమానం మొదలు అయ్యింది. కానీ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన ఫోటో అనే వార్తలు కూడా వస్తున్నాయి. నీరూ సెహగల్ పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా కూడా, చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళిపోయారు. అక్కడే మోడలింగ్ చేసి, 2015 లో మిస్ ఇండియా కాలిఫోర్నియా టైటిల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరం మిస్ ఇండియా అమెరికా పోటీల్లో కూడా పాల్గొని సెమీఫైనల్స్ వరకు వెళ్లారు. ఆర్జూ ఏ మన్ అనే ఒక సీరియల్ ద్వారా నీరూ సెహగల్ తన కెరీర్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కూడా నీరూ సెహగల్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ ఫోటోని కూడా తనే సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ALSO READ : RCB తో మ్యాచ్ లో 300 స్కోర్ చేయడానికి కమిన్స్ పెద్ద ప్లాన్…మార్క్రమ్ స్థానంలో ఎవరిని అంటే.?


End of Article

You may also like