చిన్న వయసులోనే మనకు దూరమైన 14 నటులు..! వీరిలో చాలామంది మరణాలు మిస్టరీలే..!

చిన్న వయసులోనే మనకు దూరమైన 14 నటులు..! వీరిలో చాలామంది మరణాలు మిస్టరీలే..!

by Mohana Priya

Ads

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో మనతోనే ఉంటారో లేదో చెప్పలేం. సినిమా సెలబ్రిటీలు మనకి వ్యక్తిగతంగా పరిచయం ఉండరు.

Video Advertisement

అయినా సరే వాళ్లు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎవరో మన సొంత వాళ్ళు మనకి దూరం అయినట్టు అనిపిస్తుంది.

actors who passed away at young age

ఎంతో మంది సినీ తారలు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన, లేదా చెడు అలవాట్ల వలన, లేదా ప్రమాదాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వాళ్ళలో కొంతమంది యుక్తవయసులోనే తుది శ్వాస విడిచారు. అలా చిన్న వయసులో చనిపోయిన నటులలో కొంతమంది వీళ్లు.

#1 సావిత్రి (1936 – 1981) – 45 సంవత్సరాలు

కొన్ని అలవాట్ల కారణంగా సావిత్రి గారికి ఆరోగ్యం దెబ్బతింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సావిత్రి గారు కోమాలోకి వెళ్లిపోయారు. కోమాలో ఏడాదిపాటు ఉన్న సావిత్రి గారు ఒకరోజు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు.

#2 కునాల్ (1977–2008) – 30 సంవత్సరాలు

కునాల్ ప్రేమికుల రోజు సినిమాతో అందరికీ చేరువయ్యారు. తర్వాత కొన్ని సినిమాలు చేశారు. కానీ అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సమస్యలు రావడంతో చనిపోయారు.

#3 భార్గవి (1983–2008) – 25 సంవత్సరాలు

అష్టా చెమ్మా సినిమాలో నానికి చెల్లెలిగా నటించారు భార్గవి. వాళ్ల ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదు అని భార్గవి తన బాయ్ ఫ్రెండ్ తో చనిపోదామని అనుకున్నారు. అలా చనిపోయారు భార్గవి.

#4 విజయ్ సాయి – 38 సంవత్సరాలు

అమ్మాయిలు అబ్బాయిలు, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన విజయ్ సాయి, సమస్యల కారణంగా ఒకరోజు తన ఇంట్లో చనిపోయారు.

#5 యశో సాగర్

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన యశో సాగర్, 2012 లో తదుపరి సినిమా షూటింగ్ కి వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించారు.

#6 సౌందర్య (1972–2004) – 31 సంవత్సరాలు

సావిత్రి తర్వాత అంత సహజంగా నటించగలరు అనే పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. ఎన్నికల అప్పుడు ఒక రాజకీయ పార్టీకి తన వంతు మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్ళిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్యతో పాటు వెళ్ళిన తన అన్న కూడా చివరి శ్వాస విడిచారు.

#7 ప్రత్యూష (1981–2002) – 20 సంవత్సరాలు

శ్రీ రాములయ్య, స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని సినిమాల్లో నటించిన ప్రత్యూష వ్యక్తిగత సమస్యల కారణంగా చనిపోయారు. కానీ ప్రత్యూష తల్లి మాత్రం తన కూతురు చనిపోలేదు ఎవరో కారణం ఉన్నారు అని అంటున్నారు. ఇందులో ఏది నిజం అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు.

#8 ఉదయ్ కిరణ్ (1980–2014) – 33 సంవత్సరాలు

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత కష్టపడి స్టార్ గా ఎదిగిన వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చనిపోయారు.

#9 జియాఖాన్

నిశ్శబ్ద్, గజినీ (హిందీ), హౌస్ ఫుల్ సినిమాల్లో నటించారు జియాఖాన్. ప్రేమించిన వ్యక్తి తో గొడవల కారణంగా మనస్తాపానికి గురైన జియాఖాన్ చనిపోయారు.

#10 సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – 34 సంవత్సరాలు

కొద్దికాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్, జూన్ 14 2020 న తన నివాసంలో చనిపోయారు.

#11 దివ్యభారతి (1974–1993) – 19 సంవత్సరాలు

చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దివ్యభారతి కొద్ది కాలంలోనే ఎంతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఒకరోజు పై అంతస్తులో ఉన్న తన నివాసంలో బాల్కనీ లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి చనిపోయారు. అప్పటికి దివ్యభారతి వయసు 19 సంవత్సరాలు.

#12 సిల్క్ స్మిత (1960–1996) – 35 సంవత్సరాలు

అప్పట్లో స్పెషల్ సాంగ్స్ అంటే అందులో కచ్చితంగా సిల్క్ స్మిత ఉండేవారు. ఎన్నో పాటలు లో హీరోలకు దీటుగా డాన్స్ చేసే వారు సిల్క్ స్మిత. అలాగే కొన్ని సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మేకప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి తర్వాత ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే అంత పేరు సంపాదించారు. వ్యక్తిగత సమస్యల కారణంగాచనిపోయారు. కానీ ఆమె చనిపోవడానికి ఎన్నో రకాల కారణాలు వినిపించాయి. అసలు ఆమె చనిపోవడానికి గల కారణం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

#13 పునీత్ రాజ్‌కుమార్ (1975-2021) – 46 సంవత్సరాలు

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.

punith 1

#14 ఆర్తి అగర్వాల్ (1984–2015) – 31 సంవత్సరాలు

ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల జాబితాలో ఉన్నారు ఆర్తీఅగర్వాల్. మధ్యలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టారు. లైపోసెక్షన్ ఆపరేషన్ జరిగినప్పుడు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.

3arthi

వీళ్లే కాకుండా సుత్తి వీరభద్ర రావు, రాజబాబు, ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీహరి, రఘువరన్,ఇష్టం సినిమాలో హీరోగా నటించిన చరణ్ ఇంకా ఎంతోమంది చిన్న వయస్సులో ఉన్నప్పుడే చనిపోయారు. అందులో కొంతమంది చనిపోవడానికి గల కారణాలు అందరికీ తెలిస్తే, మరి కొంతమంది చనిపోవడానికి గల కారణాలు మాత్రం మిస్టరీగా మిగిలిపోయాయి.


End of Article

You may also like