వారి సినిమాల్లో మాత్రమే కాకుండా వేరే నటుల సినిమాల్లో కూడా పాడిన 10 మంది యాక్టర్స్.! లిస్ట్ ఒక లుక్కేయండి.!

వారి సినిమాల్లో మాత్రమే కాకుండా వేరే నటుల సినిమాల్లో కూడా పాడిన 10 మంది యాక్టర్స్.! లిస్ట్ ఒక లుక్కేయండి.!

by Mohana Priya

Ads

సినిమాలో పాటలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో అయితే పాటలు సినిమాకి హైలెట్ గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే మన ఇండస్ట్రీలో ఎంతో మంది ఆల్ రౌండర్ నటులు ఉన్నారు. వారిలో కొంత మంది సింగర్స్ ఉన్నారు.

Video Advertisement

Actors who sang in other actor movies

చాలా మంది నటులు వారి సినిమాల్లో మాత్రమే పాటలు పాడారు. కానీ కొంత మంది నటులు మాత్రం వేరే నటుల సినిమాల్లో కూడా పాటలు పాడారు. అలా వేరే నటుల సినిమాల్లో పాటలు పాడిన కొంత మంది నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 ధనుష్ – యుగానికి ఒక్కడు

తమిళ్ స్టార్ హీరో ధనుష్, కార్తి హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాలో తెలుగు, తమిళ భాషల్లో ఒక పాట పాడారు.

#2 ఆండ్రియా – భరత్ అనే నేను

ఆండ్రియా మంచి నటి మాత్రమే కాకుండా మంచి సింగర్ కూడా.

ఆండ్రియా కేవలం భరత్ అనే నేను సినిమాలో మాత్రమే కాకుండా రాఖి, తుపాకీ, దేశముదురు అలాగే ఇంకా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు.

#3 శింబు – బాద్షా

తమిళ్ హీరో సింబు బాద్షా సినిమాలో,

పోటుగాడు సినిమాలో,

అలాగే కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాలో తమిళ వెర్షన్ లో ఒక పాట పాడారు.

#4 స్వాతి రెడ్డి – 100% లవ్

కలర్స్ స్వాతి 100% లవ్ సినిమాలో ఏ స్క్వేర్ బి స్క్వేర్ పాట పాడారు.

#5 జూనియర్ ఎన్టీఆర్ – చక్రవ్యూహ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చక్రవ్యూహ సినిమాలో ఒక పాట పాడారు. ఈ పాటని ప్రముఖ సంగీత దర్శకులు తమన్ స్వరపరిచారు.

#6 సిద్ధార్థ్ – నిను వీడని నీడను నేనే

హీరో సిద్ధార్థ్, సందీప్ కిషన్ హీరోగా నటించిన నిను వీడని నీడను నేనే సినిమాలో ఒక పాట పాడారు.

అలాగే సిద్ధార్థ్ తెలుగులో హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమాని తమిళంలో రీమేక్ చేశారు. అందులో జయం రవి, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగులో సిద్ధార్థ్ పాడిన అప్పుడో ఇప్పుడో పాటని తమిళ్ లో కూడా సిద్ధార్థ్ పాడారు.

#7 శృతి హాసన్ – వారణమ్ ఆయిరమ్

శృతి హాసన్ సూర్య హీరోగా నటించిన వారణమ్ ఆయిరమ్ సినిమాలో ఒక పాట పాడారు. ఈ సినిమా తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ పేరుతో విడుదల అయ్యింది.

ఈ సినిమాలో మాత్రమే కాకుండా హిందీలో అర్జున్ కపూర్ సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా నటించిన ఒక్కడు రీమేక్ అయిన తేవర్ లో కూడా ఒక పాట పాడారు శృతి హాసన్.

#8 కాజల్ అగర్వాల్ – చక్రవ్యూహ

కాజల్ అగర్వాల్ పాట పాడారు అనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. కన్నడలో చక్రవ్యూహ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పాట పాడారు.

#9 నిత్య మీనన్ – జబర్దస్త్

నిత్య మీనన్ తన సినిమాల్లో మాత్రమే కాకుండా, నందిని రెడ్డి దర్శకత్వంలో, సిద్ధార్థ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన జబర్దస్త్ సినిమాలో ఒక పాట పాడారు.

#10 రాశి ఖన్నా – బాలకృష్ణుడు

రాశి ఖన్నా, నారా రోహిత్, రెజీనా కసాండ్రా హీరో హీరోయిన్లుగా నటించిన బాలకృష్ణుడు సినిమాలో ఒక పాట పాడారు.


End of Article

You may also like