“షార్ట్ ఫిలిమ్స్” తో కెరీర్ మొదలుపెట్టిన 13 నటులు.! లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే.?

“షార్ట్ ఫిలిమ్స్” తో కెరీర్ మొదలుపెట్టిన 13 నటులు.! లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే.?

by Mohana Priya

ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ లో నటిస్తున్న ప్రతి యాక్టర్ స్క్రీన్ పై కనిపించడం అదే మొదటి సారి అవ్వాలి అని రూలేమీ లేదు. అంటే, అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

Video Advertisement

అలా షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెరీర్ మొదలుపెట్టి, యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి, తర్వాత సినిమాలతో ఇంకా పాపులర్ అయిన కొంత మంది యాక్టర్స్ వీళ్లే.

#1 చాందినీ చౌదరి

బ్రహ్మోత్సవం, మను, ఇటీవల వచ్చిన కలర్ ఫోటో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. అందులో మధురం షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు.

#2 కిరణ్ అబ్బవరం

“రాజా వారు రాణి వారు” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన “కిరణ్”,  ఇటీవల “SR కల్యాణమండపం” సినిమాతో మనముందుకు వచ్చారు. గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు కిరణ్.

actors who started career with short films

#3 విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగులో ఎంతో పాపులర్ అయ్యారు. అలాగే సైరా నరసింహారెడ్డి, ఉప్పెన ద్వారా స్ట్రెయిట్ తెలుగు సినిమాలలో కూడా కనిపిస్తున్నారు. కెరియర్ ప్రారంభంలో విజయ్ సేతుపతి షార్ట్ ఫిలింస్ లో నటించారు. అలాగే టీవీ సీరియల్ లో కూడా యాక్ట్ చేశారు.

#4 పూజిత పొన్నాడ

కల్కి, బ్రాండ్ బాబు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన పూజిత పొన్నాడ కూడా అను తను నేను, పరిచయం, దీపికా పదుకొనే ఇంకా ఎన్నోషార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.

#5 సుహాస్

ప్రతి రోజు పండగే, మజిలీ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించి, ఇటీవల కలర్ ఫోటో ద్వారా హీరోగా మన అందర్నీ అలరించిన సుహాస్ అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అందులో అతిధి షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అతిధి షార్ట్ ఫిలింలో తన పెర్ఫార్మెన్స్ కి ఎందరో సెలబ్రిటీల నుండి ప్రశంసలు అందుకున్నారు.

#6 రీతు వర్మ

పెళ్లిచూపులు, కేశవ సినిమాల్లో నటించిన రీతు వర్మ, అనుకోకుండా అనే షార్ట్ ఫిలిం నటించారు.

#7 విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్, హిట్ సినిమాలతో పాపులర్ అయిన విశ్వక్ సేన్, పిట్టకథ అనే షార్ట్ ఫిలిం లో నటించారు.

#8 నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి AIB లో ఎన్నో వీడియోస్ లో నటించారు. అందులో ఇంజినీరింగ్ గురించి చేసిన ఒక వీడియో ద్వారా నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించారు.

#9 రాజ్ తరుణ్

ఉయ్యాల జంపాల, రాజుగాడు, కుమారి 21ఎఫ్, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన రాజ్ తరుణ్ అంతకు ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.

#10 ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా ద్వారా మనందరికీ పరిచయమైన ప్రియాంక జవాల్కర్ పొసెసివ్ నెస్, ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

#11 వైష్ణవి చైతన్య

సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంకా ఎన్నో వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య కూడా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.

#12 విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఒక తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా వేరే భాష ఇండస్ట్రీలలో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షార్ట్ ఫిలిం లో నటించారు.

#13 రూప కొడువాయూర్

ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య చిత్రంలో “రూప” కనబరిచిన నటన అందరినీ ఆకట్టుకుంది. రూప హీరోయిన్ కంటే ముందు ఒక ఎంబిబిఎస్ స్టూడెంట్ అలాగే భరతనాట్యం డాన్సర్. అంతేకాదు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.


You may also like