Home Filmy Adda ఈ 10 మంది నటించిన ఈ సినిమాలు… వారు చనిపోయాక విడుదలయ్యాయని మీకు తెలుసా.?

ఈ 10 మంది నటించిన ఈ సినిమాలు… వారు చనిపోయాక విడుదలయ్యాయని మీకు తెలుసా.?

by Mohana Priya

చాలా సినిమాలు చెప్పిన టైంకి విడుదల అవ్వకపోవడం జరుగుతూనే ఉంటాయి. ఇందులో పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు చాలా ఉంటాయి. దానికి కారణాలు కూడా చాలానే ఉంటాయి. కొన్ని టెక్నికల్ కారణాలు అయితే కొన్ని ఇంకా వేరే కారణాలు అయి ఉండొచ్చు. ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవకపోవడం, షూటింగ్ ఇంకా మిగిలిపోవడం. కొన్ని ఎన్ని సీన్స్ బాగా రాకపోతే మార్చడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. వీటివల్ల సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం అవుతూ ఉంటుంది.

అయితే ఇవన్నీ కాకుండా ఆ సినిమాలో కీలక పాత్రలు పోషించిన కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా చాలా మంది నటులు వారు ఒక సినిమా చేస్తున్నప్పుడు మధ్యలోనే లేదా సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఇంకా మిగిలిన పనులు ఉన్నప్పుడు మరణించారు. అలా ఆ నటులు మరణించిన తర్వాత విడుదలైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 పునీత్ రాజ్‌కుమార్

జేమ్స్

పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన జేమ్స్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

#2 శ్రీదేవి

జీరో

శ్రీదేవి అతిథి పాత్రలో నటించిన జీరో సినిమా శ్రీదేవి మరణించిన తర్వాత విడుదల అయ్యింది.

sridevi

 

#3 ఎంఎస్ నారాయణ

సన్నాఫ్ సత్యమూర్తి

ఎమ్మెస్ నారాయణ గారు చనిపోయిన తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మొదటగా విడుదల అయిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి.

actors whose movies got released after their demise

#4 ఉదయ్ కిరణ్

చిత్రం చెప్పిన కథ

ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం చెప్పిన కథ సినిమా ఇప్పటికి కూడా విడుదల అవ్వలేదు.

uday kiran 1

#5 దివ్య భారతి

తొలి ముద్దు

దివ్య  భారతి హీరోయిన్ గా నటించిన తొలిముద్దు సినిమా షూటింగ్ మధ్యలోనే దివ్యభారతి చనిపోయారు. దాంతో దివ్య భారతి స్థానంలో రంభ నటించారు.

#6 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

దిల్ బేచారా

సుశాంత్ హీరోగా నటించిన దిల్ బేచారా సినిమా కూడా సుశాంత్ మరణించిన తర్వాత విడుదల అయ్యింది. ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి అవ్వకుండానే సుశాంత్ మరణించారు. దాంతో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ సుశాంత్ కి డబ్బింగ్ చెప్పారు.

#7 ఓం పురి

ట్యూబ్ లైట్

ప్రముఖ సీనియర్ నటుడు ఓం పురి ఒక ముఖ్య పాత్రలో నటించిన ట్యూబ్ లైట్ సినిమా కూడా ఓం పురి చనిపోయిన తర్వాత విడుదల అయ్యింది.

actors whose movies got released after their demise

#8 వివేక్

అరణ్మనై 3

ప్రముఖ తమిళ నటుడు వివేక్ నటించిన అరణ్మనై 3 సినిమా కూడా వివేక్ మరణించిన తర్వాత విడుదల అయ్యింది.

#9 అక్కినేని నాగేశ్వరరావు

అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన మనం సినిమా కూడా నాగేశ్వరావు గారు చనిపోయిన తర్వాత విడుదల అయ్యింది.

actors whose movies got released after their demise

#10 విష్ణువర్ధన్

కన్నడ హీరో విష్ణువర్ధన్ నటించిన ఆప్త రక్షక సినిమా ఆయన చనిపోయిన తర్వాత విడుదల అయ్యింది.

వీరు మాత్రమే కాకుండా, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మరణించిన తర్వాత ఆయన పాడిన అన్నాత్తే సినిమాలోని పాట, అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరణించిన తర్వాత ఆయన రాసిన కొన్ని పాటలు విడుదల అయ్యాయి. వీరితో పాటు మరికొంత మంది నటుల సినిమాలు కూడా వారు మరణించిన తర్వాత విడుదల అయ్యాయి.

You may also like