Ads
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ డ్రగ్స్. సెప్టెంబర్ 3వ తేదీన నటి రాగిణి ద్వివేది కి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిఐ) పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ సిసిఐ పంపించిన నోటీసులకు రాగిణి ద్వివేది స్పందించకుండా ఆమె తరపున లాయర్లను పంపి సోమవారం వరకు సమయం కావాలని కోరారు. ఆమె రిక్వెస్ట్ ని పోలీసులు తిరస్కరించారు.
Video Advertisement
సెప్టెంబర్ నాలుగవ తేదీ అంటే నిన్న డ్రగ్స్ పెడ్లింగ్ కి సంబంధించి జ్యుడిషియల్ లే అవుట్ యలహంక్ లో ఉన్న రాగిణి ద్వివేది ఇంటిపై మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ తో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. ఆమె ఇంటి ప్రాంగణం మొత్తం పరిశోధించిన తర్వాత రాగిణి ద్వివేది ని సిసిఐ అదుపులోకి తీసుకుంది. రాగిణి ద్వివేది స్నేహితుడు రవి శంకర్ ని పోలీసులు విచారించిన తర్వాత రాగిణి ద్వివేది ని అరెస్ట్ చేశారు.
End of Article